ఎలా నా మనసులో నాకే తెలీకుండా ప్రవేశించిందో,
ఎలా నన్ను అడుగడుగునా నన్ను మార్చుతూ వచ్చిందో,
*ఎలా నా జీవిత గమనం నువ్వే, నా ఉచ్చ్వాస, నిశ్వాశములు నువ్వే, చివరకు నా సర్వస్వం, నా ప్రాణం నువ్వే అనే స్థితికి నన్ను చేర్చిందో తెలీదు...*
ఏమిటో దాని మాయ, నన్ను కదిలించి వేసింది, నన్ను నేనుగా కాకుండా ఒక అద్భుతంలా తయారు చెయ్యాలని కాబోలు తన ఆశ... చివరకు తనే నెగ్గింది, నెగ్గుతోంది..
ప్రేమికుల రోజెనా ప్రతి రోజు, ప్రతి క్షణం... నే పడిపోయా... పడిపోయా...పడిపోయా....
చిన్నప్పుడు పెద్ద కలిసేది కాదు,
10వ తరగతి తరువాత అప్పుడప్పుడు శ్రావణ సమీరంలాంటి ఆలోచనల్లో తళుక్కు మని వచ్చిపోయేది...
వుద్యోగం చెరిన తరువాత నువ్వే కావాలి అని అనిపించినా పని వత్తిడిలో కుదరలేదు...
కానీ తానే కావాలనే బలమైన సంకల్పం పెరుగుతూ వచ్చింది....ఎక్కడవున్న పక్కన నువ్వే ఉన్నట్టు... అందుకునేమో పరుగు పరుగు హైదరాబాద్ కొలువు కోసం వెంపర్లాడి ఎలాగలగో పట్టాను వుద్యోగం.
పల్లెటూరి నాకు పట్నాన్ని, ప్రపంచాన్ని పరిచయం చెసింది. తన ద్వారా ఎంతో మంది ఆత్మ బంధువులు పరిచయం, స్నేహం, సాన్నిహిత్యం...
నేను నేనుగా లేనే నిన్న మొన్న లా.... నన్ను నేనే నమ్మలేనట్టు మారిపోయాను....
జీవితంలో ప్రతి క్షణం ప్రేమే, కానీ జీవితాన్ని ప్రేమించే ఈ ప్రేమ అజరామరం
Happy Valentines Day
*ఇంతకీ ఎవరో చెప్పుకోండి చూద్దాం???*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి