1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

10, ఏప్రిల్ 2017, సోమవారం

ఉన్నతమైన, కఠినమైన లక్ష్యం వున్నప్పుడు సాధన లో ఎన్నో కస్టాలు, నష్టాలు వుంటాయి

[10/30, 8:07 PM] Sarvaraju Srinivas Prasad

మేము అంతే అందర్నీ మిస్ అవుతున్నాము... కాని లక్ష్య సాధనలో ఇవన్ని మాములే.

ఉన్నతమైన, కఠినమైన లక్ష్యం వున్నప్పుడు సాధన లో ఎన్నో కస్టాలు, నష్టాలు వుంటాయి.

కాని లక్ష్యం చేరే దారిలో ఎన్నో ఆనందాలు, మరిచిపోలేని అనుభూతులు, చదువులో నేర్చుకొలేని పాఠాలు, అనుభవాలు, నమ్మకం, ఆత్మ విశ్వాసం అన్నింటి కంటే ముఖ్యంగా వొర్పూ మన ఆమ్ముఁళ పొదిలో చేరుతాయి

మన సంకల్పానికి దైవ సహాయం, మీ లాంటి ఎంతో మంది ప్రేమ, అభిమానం, ఆత్మీయత ముందుకు నడిపిస్తాయి

మనకు ఎనలేని సంతృప్తి, జీవితానికి ఓక అర్ధం దారి పొడుగునా మనతో మకాం వేస్తాయి.

కొంత మంది నువ్వు కత్తి, కేక అంటారు,
ఇంకొంత మంది నిన్ను చూసి నవ్వుతారు, హేళన చేస్తారు,
మరికొంత మంది తిడుతారు..

నీ లక్ష్యం మీద నీకు పూర్తి అవగాహన వున్నప్పుడు నువ్వు చెవిటి వాడివి అయిపోవాలి.

చెడును మరచి, సలహాలను స్వీకరించి అడ్డంకులను అందమైన మెట్లుగా చేసుకొని నీ లక్ష్యం వైపు ధూసుకుపోవాలి

ఎందుకంటె నీ కంటే తోపు ఎవడు లేడిక్క్డ

కామెంట్‌లు లేవు: