జీవితంలో నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రేమించుకోకపోవడం లేదా ఎవరినో ఒకరిని (తల్లి, తండ్రి, గురువు, భార్య, తోబుట్టువులూ, స్నేహితులు, బంధువులు, పిల్లలు.....) ఎక్కువగా ప్రేమించడం అసలు సమస్యలకి మూలం. ఆ ఒకరు దూరం అయినపుడు... నీకు నువ్వే, ఎప్పుడూ నీడలా వుంటూ, కడదాకా వచ్చే ఒకే ఒక తోడువని మరచి, వారి కోసం ఇక ప్రపంచమే లేదు, జీవితం వ్యర్థం అని భావించి అర్దం కాకుండా వారి జ్ఞాపకల్లో చావలేక బ్రతుకుతావు లేదా అర్ధంతరంగా ముగిస్తున్నావు....
అలా కాకుండా నువ్వు ఎక్కువ ప్రేమించే వారితో పాటుగా నీ చుట్టూ వున్న అందరిని ప్రేమిస్తూ... నిన్ను, నీ జీవితానికి సార్ధకత చకూర్చేే లక్ష్యాన్ని ప్రేమిస్తూ ఉంటే... నీ జీవన పయనంలో వచ్చే, పోయే అన్నింటిని అంగీకరించగల మానసిక స్టైర్యం నీ సొంతమవుతుంది. వారి దూరంతో నీకు దగ్గరైన నిరాశ, నిస్ప్రుహ నీకు దూరమవుతాయి.
జీవితం అంటే నువు ప్రేమించే ఒకరో ఇద్దరోనో లేక నీఉద్యోగమో లేక నీ లక్ష్యమో లేక నీస్నేహమో, ప్రేమో లేక నీకు నువ్వు హ్యాపీగా బ్రతకడమో కాదు...
జీవితం అంటే నువ్వు ఆనందంగా బ్రతుకుతూ, అందరూ ఆనందంగా ఉండేలా చెయ్యడం...కనీసం అవతలివారి ఆనందం కోసం ప్రయత్నించడం, అదీ కుదరకపోతే ప్రార్దించడం (సర్వేజనా సుఖినో భవంతు)..... అందరిని ప్రేమించడం....అందరినీ సేవించడం..
నీ జీవితానికి సార్ధకత చేకూర్చే నలుగురికి ఉపయోగపడే పని చెయ్యడం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన, ఎవ్వరు నీతో చేరినా, నీ నుంచి విడిపోయినా, వంటరైనా, వందమంది ఉన్న దీని కోసమే మనం బ్రతకాలి.
నీ జీవితం విలువైనది, నీ సంకల్పం దృఢమైనది, నీ లక్ష్యం గొప్పది, నీ శక్తి సామర్ధ్యాలు దేన్నైనా సాధించ గలిగినవి... గుర్తించు....ప్రయత్నించు....విజయలక్ష్మి నిన్నే వరిస్తుందిరా డింభకా....ఆనందం, తృప్తి ఎప్పుడూ ప్రతి క్షణం నీ వెంటేరా నాయకా...
హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్ ...
నా రాతలు మరిన్ని చదవాలంటే దయచేసి కింద లింక్ క్లిక్ చెయ్యండి
2017/06/16 23:56
5 కామెంట్‌లు:
Worthy & Meaning full content anna
అద్భుతం!
అద్భుతమైన సంకల్పం
Chala baga rasaru Anna
Chala baga rasaru Anna
కామెంట్‌ను పోస్ట్ చేయండి