1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

22, జులై 2017, శనివారం

సేవ నా ఒక్కడి తృప్తి కోసమా - నా దేశం కోసమా...


తన తృప్తి కోసం సేవ చేసేవారు తాను మాత్రమే (గొప్ప పనైనా) వంటరిగా చేసుకుంటూ పోతారు. వారి ద్వారా వారికి దగ్గరైన వారు ఎవరో కొంత మంది మాత్రమే ప్రేరణ పొందుతారు.

కానీ *దేశం కోసం సేవ చేసే వాడు, సేవ చెయ్యాలనే గొప్ప తపన కలిగిన వారిని మరికొంత మందిని తయారు చేసి, ఈ దేశానికి అందిస్తారు.* ఎందుకంటే ఒక్కరే చేసేది చాలా పరిమితం, ఎవరో కొంతమందికే అందుతుంది.తన లాంటి వాళ్ళను తయారు చేయగలిగితే, వారు కూడా మరి కొంత మందిని తయారు చెయ్యగలిగితే... దేశంలో ఎక్కువ మందికి సేవ చేయవచ్చును.

భగత్ సింగ్ చనిపోతే, మరో భగత్ సింగ్ పుట్టలేదు.. కాబట్టి మనం వ్యక్తిగా కాదు, మర్రి ఊడలలాగా పాతుకుపోయే బలమైన వ్యవస్థను /వ్యవస్థ లాంటి మనుష్యులను తయారుచేసి దేశానికి బహుమతిగా ఇవ్వాలి.

*నాయకత్వ లేమి సంఘానికి శ్రేయస్కరం కాదని తెలిసినవారు సరైన నాయకుడికోసం వెదుకులాడుతున్నారు....కాబట్టి నీలో వుండే నాయకుడిని నిద్ర లేపు నేస్తమా, పనులు చెయ్యడంతో పాటు, 10 మందిని తయారు చేయడం గురించి కూడా ఆలోచించు మిత్రమా.....*

నా రాతలు మరిన్ని చదవాలంటే దయచేసి కింద లింక్ క్లిక్ చెయ్యండి
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

అమ్మ శ్రీనివాస్
www.aswa.co.in
9948885111
2017/07/22 01:04

కామెంట్‌లు లేవు: