మనం చాలా సార్లు మంచి పుస్తకం కనపడగానే కొనేస్తాం... వీలైనప్పుడు చదువుతూ ఉంటాం...
కొంతమంది కనపడగానే వెంటనే ఒకే సారి లేక 2,3 రోజులలో దాని పని పట్టేస్తారు..
కానీ నా ఉద్దేశ్యంలో పుస్తకాన్ని చదివేటప్పుడు అన్ని విషయాలను (ముఖ్యంగా అందులో మంచి విషయాలను) మన జీవితంలో పోల్చి చూసుకోవాలి. మనం పాటిస్తూన్నామా ? లేదా? పాటించడానికి ఏమి చెయ్యాలి ? పాటిస్తూ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? అక్కడ ఎలా వుందో అలానే పాటించాలా లేదా కొన్ని చిన్న చిన్న మార్పులు చెయ్యాలా? *ఇలా చదివిన దానిని మన జీవితానికి పోల్చి చూసి లేదా మన చుట్టూ వున్న వారి జీవితాలతో పోల్చి చూసుకుంటూ చదివితే...అది నేర్చుకొని, వంట పట్టించుకోవడం అవుతుంది....*
అమ్మ శ్రీనివాస్
www.aswa.co.in
9948885111
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి