1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, జూన్ 2018, శనివారం

నేర్చుకోవడాన్ని నేర్చుకోవాలి

*మీరు అంజనం వేస్తారా?*

మీ దగ్గర భవిష్య వాణి ఉందా? లేదా

*చంద్రముఖిలో రజని లా అవతలి వారి మనసుల్లో ఏమి అనుకుంటున్నారో ఇట్టే చెప్పేసే విద్య తెలుసా?*

*నేర్చుకోవడం* - చాలా మందిలో ఈ తపన ఉండడం లేదు. ఎందుకంటే "నాకు అన్నీ తెలుసు" అనే ఒక "అహం"భావన. ఇప్పుడు నిరంతర విద్యార్థులు చాలా తక్కువ కనిపిస్తున్నారు మనకి...

*అశ్వ సలహాదారు శ్రీ జవాహర్ లాల్ నెహ్రూ గారు* ఈ విషయం గురించి చెప్పడంలో సిద్ధహస్తులు. ఆయన చెప్పినట్టుగా.....ఎదుటి వ్యక్తి ఏమి చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో వినకుండానే, తెలుసుకోకుండానే నాకు వారు చెప్పబోయేది తెలుసు అని ఎలా నిర్ణయిస్తాము??? ఇలా అనుకోవడమే *మనం నేర్చుకోడానికి, ఎదగడానికి సిద్ధంగాలేమనే సంకేతాన్ని నేరుగా ఇస్తుంది.*

మన చుట్టూ వున్న సమాజాన్ని గమనిస్తే, తమలో ఉన్న లోపం తెలిసి కూడా, దానిని మార్చుకునే ప్రయత్నం చెయ్యకుండా.. *అదేదో ఒక గొప్ప ఆస్తి లా భావించేవారే ఎక్కువ...* ఇదే వారి జీవితం ఆనందంగా లేకపోవడానికి మూలం అని వారు తెలుసుకోరు, పైగా వారు ఆనందంగానే ఉన్నాం అనే భ్రమలో బతికేస్తుంటారు.

*నేర్చుకునే తత్వం ఉన్న వారికి, మొదట ఎదుటి వారు చెప్పినది వినే ఓపిక, సహనం ఉంటాయి. తరువాత ఆచరణ గురించి... కానీ మనం సీతయ్యలం కదా... ముందు అసలు ఎవ్వరి మాట వినం. వీరు అంజనం వేస్తారో, భవిష్య వాణి ఉందొ లేదా చంద్రముఖిలో రజని లా అవతలి వారి మనసుల్లో ఏమి అనుకుంటున్నారో ఇట్టే చెప్పేసే విద్య తెలుసునో,* నాకైతే అర్థంకాదు. ఎందుకంటే ఎదుటి వారు ఏమి, ఎలా చెప్తారో అన్నీ వీరు మాకు తెలుసు అనుకుంటారు...... అని సర్ అంటుంటారు...

*నేను చూసిన చాలా మందికి వృత్తి, వ్యక్తిగత జీవితాలలో ఇతరులతో సంబంధాలు కొనసాగించడంలో ఇదే అతి పెద్ద అడ్డంకి...* నేను, ఆ మాటకొస్తే అందరం కూడా అలాంటివారమే... కాకపోతే కొంచెం నేర్చుకోవడాన్ని అలవరచుకున్నాం కాబట్టి కొంత బెటర్, మనల్ని మనం మార్చుకోవడంలో....

*కాబట్టి... ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి నేను సెప్పొచ్చేది ఏమిటంటే... ముందు "నేర్చుకోవడాన్ని నేర్చుకోవాలి" అలవాటు చేసుకోవాలి, తపన పెంచుకోవాలి... ఆనందం, అభివృద్ధి సదా మీ వెంటే..*

నా అనంతరంగం మీ అమ్మ శ్రీనివాస్.. 2018/06/30 07:41


18, జూన్ 2018, సోమవారం

*కలలాంటి ఓ మెలకువ...కలలో మాత్రమే సుమీ*

నెలకు ఒక చిన్న మొత్తం (100/- రూపాయలు అనుకుందాం) సమాజం కోసం కేటాయించలేనంతగా *దారిద్ర్య రేఖకు దిగువన మనం ఉన్నామా? అని ఎవరో నన్ను అడుగుతున్నారు...*

పాపం ఉండే వుంటావులే.... ఎందుకంటే తాత్కాలిక ఆనందాల కోసం పెట్టే అన్ని ఖర్చులు కలిపి కనీసం నెలకు 1000/- కు పై మాటే... అలాంటప్పుడు పాపం 100/- బడ్జెట్ కేటాయించడం కష్టమే కదా నీకు... *ఈ 100/- లేకపోతే ఎన్ని ముఖ్యమైన పనులు ఆగిపోయి, నా కుటుంబం వీధిన పడదు... నిజమే సుమీ....*

నిద్రలేచి చూస్తే సమయం ఉదయం ఎనిమిదే.... కళ్ళు నులుముకుంటూ...  *(ఒరేయ్ కలల రాక్షసుడా...) ఓ చెప్పోచ్చావులే, నాకు సంపాదన కోణంలో దరిద్రత లేదు...* ఏదో కొంచెం ఇచ్చే హృదయం లేక, వంద కుంటి సాకులు చెపుతా, విని విననట్టు ఊరుకో.... *ఎందుకంటే పోయేటప్పుడు నేను మొత్తం మూట కట్టుకుపోవాలిరా ఉత్తమోత్తమ...* అంటూ నా అనంతరంగం మళ్ళీ నిద్రలోకి జారుకుంది... మీ అమ్మ శ్రీనివాస్ 2018/06/18 22:20
 http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

13, జూన్ 2018, బుధవారం

శ్రీమతి... నువ్వే నా జీవితానికి ఒక బహుమతి

*జీవితమనే ప్రయోగాల బాటలో, ఆమే నాకు బాసట...లక్ష్య సాధనలో నాకు ఎన్నడూ రానీయదు అలసట...*

నాపై వత్తిడిని మొత్తం తాను తీసేసుకుంటుందట....

*ఇంటి మొత్తాన్ని, పాప బాధ్యతని చూసుకోవడమే కాదు, సంస్థ పనులను కూడా చాలా వరకు ఎంతో సహనంతో, ఓర్పుతో సమన్వయపరచుకుంటూ.. మరో పక్క దీని కోసం ఎన్నో విషయాలు నేర్చుకొంటూ...*

భార్య భర్తలుగా మేము మాట్లాడుకునే 95% మాటలు సమాజం గురించే అయినా, ఎంతో పరిణితి తో సర్దుకుంటూ...

ఇప్పటి సమాజంలో అమ్మాయిలలా ఆడంబరాలు, ఆశలు, అపార్ధాలు లేకుండా.. నన్ను, నా ఆశయాలను అర్ధంచేసుకుంటూ, అండగా నిలుస్తూ...

*అందం, అనుకువ, అనురాగం, ఆప్యాయత, ఆదరణ, ఓర్పు, సహనం, ప్రేమ, సేవ, ధైర్యం అనే ఎన్నో అపురూప గుణాల కలయిక...ఈ వనిత....అదేనోయ్ మన హరిత....*

నా లాంటి లక్ష్య సాధన ఉన్న వాడితో వేగడం ఒక ఎత్తు... అందులో కూడా అర్ధ భాగం తీసుకొని 7 అడుగులే కాదు, ప్రతి అడుగు మీ అడుగులోనే అని ముందుంటూ, *నా కంటే మిన్నగా ఎన్నో వ్యక్తిగత ఆశలను, ఇష్టాలను సమాజ సేవ కోసం తృణ ప్రాయంగా వదులుకుంటున్న* నీతో పయనించడంకంటే నాకు ఆనందం ఏముంటుంది సుమీ....

*నా హృదయ స్పందన అశ్వ అనే భావన వున్నా, నా ఈ అడుగులో అడుగుగా, ఆలోచనలో ఆలోచనగా తనే నిండి వుండే, నా హృదయ సామ్రాజ్యపు పట్టపురాణికి ఇవే మా హార్ధిక జన్మ దిన శుభాకాంక్షలు...* ఎన్నెన్నో జన్మల బంధమో లేక మన జీవిత పరమార్ధాన్ని తెలియచెప్పడం దేవుడు పెనవేసిన బంధమో...మాది ప్రేమ వివాహం అనడం కంటే, సేవ వివాహం అనడం సబబేమో... 

*నీకు మరింత ఆరోగ్యం, ఆనందం, తృప్తి, సంతోషం, సమృద్ధిని.. సమాజ సేవలో సాగించడానికి, నా లాంటి వాడిని వేగడానికి కావలసిన శారీరక, మానసిక స్టైర్యాన్ని దేవుడు సదా నీకు ప్రసాదించాలని కోరుకుంటూ....*  అమ్మ శ్రీనివాస్.....