1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, జూన్ 2018, శనివారం

నేర్చుకోవడాన్ని నేర్చుకోవాలి

*మీరు అంజనం వేస్తారా?*

మీ దగ్గర భవిష్య వాణి ఉందా? లేదా

*చంద్రముఖిలో రజని లా అవతలి వారి మనసుల్లో ఏమి అనుకుంటున్నారో ఇట్టే చెప్పేసే విద్య తెలుసా?*

*నేర్చుకోవడం* - చాలా మందిలో ఈ తపన ఉండడం లేదు. ఎందుకంటే "నాకు అన్నీ తెలుసు" అనే ఒక "అహం"భావన. ఇప్పుడు నిరంతర విద్యార్థులు చాలా తక్కువ కనిపిస్తున్నారు మనకి...

*అశ్వ సలహాదారు శ్రీ జవాహర్ లాల్ నెహ్రూ గారు* ఈ విషయం గురించి చెప్పడంలో సిద్ధహస్తులు. ఆయన చెప్పినట్టుగా.....ఎదుటి వ్యక్తి ఏమి చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో వినకుండానే, తెలుసుకోకుండానే నాకు వారు చెప్పబోయేది తెలుసు అని ఎలా నిర్ణయిస్తాము??? ఇలా అనుకోవడమే *మనం నేర్చుకోడానికి, ఎదగడానికి సిద్ధంగాలేమనే సంకేతాన్ని నేరుగా ఇస్తుంది.*

మన చుట్టూ వున్న సమాజాన్ని గమనిస్తే, తమలో ఉన్న లోపం తెలిసి కూడా, దానిని మార్చుకునే ప్రయత్నం చెయ్యకుండా.. *అదేదో ఒక గొప్ప ఆస్తి లా భావించేవారే ఎక్కువ...* ఇదే వారి జీవితం ఆనందంగా లేకపోవడానికి మూలం అని వారు తెలుసుకోరు, పైగా వారు ఆనందంగానే ఉన్నాం అనే భ్రమలో బతికేస్తుంటారు.

*నేర్చుకునే తత్వం ఉన్న వారికి, మొదట ఎదుటి వారు చెప్పినది వినే ఓపిక, సహనం ఉంటాయి. తరువాత ఆచరణ గురించి... కానీ మనం సీతయ్యలం కదా... ముందు అసలు ఎవ్వరి మాట వినం. వీరు అంజనం వేస్తారో, భవిష్య వాణి ఉందొ లేదా చంద్రముఖిలో రజని లా అవతలి వారి మనసుల్లో ఏమి అనుకుంటున్నారో ఇట్టే చెప్పేసే విద్య తెలుసునో,* నాకైతే అర్థంకాదు. ఎందుకంటే ఎదుటి వారు ఏమి, ఎలా చెప్తారో అన్నీ వీరు మాకు తెలుసు అనుకుంటారు...... అని సర్ అంటుంటారు...

*నేను చూసిన చాలా మందికి వృత్తి, వ్యక్తిగత జీవితాలలో ఇతరులతో సంబంధాలు కొనసాగించడంలో ఇదే అతి పెద్ద అడ్డంకి...* నేను, ఆ మాటకొస్తే అందరం కూడా అలాంటివారమే... కాకపోతే కొంచెం నేర్చుకోవడాన్ని అలవరచుకున్నాం కాబట్టి కొంత బెటర్, మనల్ని మనం మార్చుకోవడంలో....

*కాబట్టి... ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి నేను సెప్పొచ్చేది ఏమిటంటే... ముందు "నేర్చుకోవడాన్ని నేర్చుకోవాలి" అలవాటు చేసుకోవాలి, తపన పెంచుకోవాలి... ఆనందం, అభివృద్ధి సదా మీ వెంటే..*

నా అనంతరంగం మీ అమ్మ శ్రీనివాస్.. 2018/06/30 07:41


కామెంట్‌లు లేవు: