1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, సెప్టెంబర్ 2018, మంగళవారం

పెళ్లి... అయిన వారికి, కాని వారికి కూడా....

నా అనంతరంగం, అమ్మ శ్రీనివాస్ 2018/09/04 20:40

*పెళ్లి... అయిన వారికి, కాని వారికి కూడా....*

పెళ్లి అనే లక్ష్య సాధన కోసం - శ్రద్ధతో, ఏకాగ్రతతో, నిరంతరం కృషి చేసి, అదేనండి పెళ్లి అయ్యే దాకా నానా కష్టాలు పడి, ఎలాగో పప్పన్నం పెడుతున్నారు...

కానీ మొదటి రోజు నుంచే, కాదు మొదటి క్షణం నుంచే అభిప్రాయభేదాలు, తెంచుకోలేక, అతుక్కోలేక పాపం నానా అగచాట్లు.. *దీనికి ఒకటే పరిష్కారం ఉంది, తెలుసుకోవాలంటే మొత్తం చదువుడి....*

పరిపక్వత లేకపోవడం వలననో, సమాజం గురించి తెలియకపోవడం వలననో, *అన్నిటికంటే మిన్నగా వారిద్దరి మధ్య అవగాహన లేకపోవడం వలననో... కారణం ఏదైనా ప్రస్తుత సమాజంలో ట్రెండ్ ఇదే...*

ఇవన్నీ రావాలంటే మొదట వారికి, వారి జీవితాల మీద(జీతాల మీద కాదు) సంపూర్ణ అవగాహన, స్పష్టత రావాలి కదా... వద్దులే బాబాయ్ అదో పెద్ద సబ్జెక్ట్ అంటారా,అదీ నిజమే... ఇప్పుడెందుకులెండి ఆ విషయం...

*ఇక పెళ్లి విషయానికొస్తే, ఇక్కడ నేను అబ జరవు సేసింది ఏమిటంటే, పెళ్లి ఎందుకో క్లారిటీ లేదు, ఎలాంటి వారిని చేసుకోవాలో  అంతకంటే క్లారిటీ లేని విషయం,(ఏంటి బాగా కట్నం ఇస్తే/ అందంగా ఉంటే/ స్టేటస్ ఉంటే చాలా...??? నాకు తెలీదు నాయనోయ్ దీనిగురించి)  పోనీ ఎలా ఒకరినొకరు అర్ధం చేసుకొని, సంసారాన్ని  ఆనందంగా గడపాలో అస్సలు తెలుసుకోము... దీనిని కూడా పరువు, ప్రెస్టీజి కోసమే చేసుకుంటే, జీవితం ఇలా కాక ఎలా ఉంటుంది. ఇంట్లో పెద్ద వారు, ఇంత జీవితాన్ని అనుభవించి, ఎలాంటి వారిని సెలెక్ట్ చెయ్యాలి లేదా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోకుండా అడుగులు వెయ్యడం నిజంగా హృదయవిధారకం.*

మన జీవితంలో మన రోల్ గురించే మనకి తెలీనప్పుడు, మన అర్ధ భాగానికి వారి రోల్ గురించి ఏ...మి సేపతాం సెప్పు... రోల్ డిఫైన్ కాకపోతే, బాధ్యత లు డిఫైన్ కావు... కావున ఫోకస్ ఉండదు.. *ఏది చిన్న విషయమో వదిలేయాలో, ఏది పెద్ద విషయమో పట్టించుకోవాలో అస్సలు అర్థంకాదు.. ప్రతిదీ తెగే దాకా లాగడం ఎందుకంటే ఈఈఈఈగో.... తగ్గడం, తలదించుకోవడం, ఓడిపోవడం అలవాటు లేకపోవడం. ఇద్దరు సమానమే, కానీ ఎవరికి ఏ పనులు నప్పుతాయో తెలీదు...ఇద్దరు ఒకే పని చేయాలి మరి మిగతా పనులు? ఉద్యోగాలే చెయ్యాలి, ఇద్దరు డబ్బే సంపాదించాలి. మరి ఇల్లు, పిల్లలు, కుటుంబం??  ఏమిటండి మీరు మాట్లాడేది ఇంటి కోసమే, పిల్లల కోసమే అహర్నిశలు ఎంత కూడబెడుతున్నాము, జీవితాలను ధార పోస్తున్నాము కనపడడం లేదా??? నిజమే మరి వారి పెంపకం,  ఓ..స్ అదేం పెద్ద పని, ఒక మాంచి పని ఆమెను పెట్టుకుంటే సరిపోయే, కాస్ట్లీ ప్లే స్కూల్ లో వేస్తాం.... పిల్లల భవిష్యత్తు కంచికి, మనమేమో ఆపీసుకి..పోలా, అధిరిపోలా...

*ఒక్కసారి ఆలోచిస్తే పెళ్లికి ముందు గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చ్ ల్లో రోజుల నుంచి కొన్ని సంవత్సరాలు తరబడి కూడా తిరిగిన వారు వున్నారు... అవి, ఇవి ఒకటేమిటికి చెప్పినవన్నీ ఒక సారి కాదు, ఒకటికి పది, కానే కాదు వందల సార్లు చేసి ఎదురు చూసిన వారు మనకు తెలుసుగా... వీటి వల్ల పెళ్లిళ్లు అవుతాయా? (ఇప్పుడు ఈ చర్చ మనకెందుకులేండి, మన పాయింట్ ఇది కాదు కదా, వదిలేద్దాం)..*

*అసలు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఇంత సమయం వెచ్చించి, ఇంత కష్టపడి, శ్రమకోర్చి పెళ్లి చేసుకున్నాం... మరి ఈ బంధం కలకాలం ఆనందంగా, అర్థవంతంగా ఉండడానికి మనం ఏమి చేస్తున్నాం, ఎంత సమయం వెచ్చిస్తున్నాం?*

పెళ్లి దాకా ఏవేవో సమస్యలు, కానీ పెళ్ళైతే ఒకటే సమస్య, అది పెళ్లవడమే.. దీని పరిష్కారాన్ని ఆలోచించటానికి మటుకు సమయం ఉండదు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చివరికి విడిపోవడానికైనా సిద్ధమే, కానీ నేర్చుకువడానికి, అవగాహన పెంచుకోవడానికి, అపార్ధాలు తొలగించుకొని, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి మాత్రం సిద్ధం కాదు... అంటే పెళ్లి ఉద్దేశ్యం స్వల్ప కాలికమా, దీర్ఘ కాలికమా ? ఏమిటండీ ఇవన్నీ...శోది విషయాలు కాకపోతే, అవును మరి సాధించలేనివి, శోధించలేనివి అన్ని మనకి సోదే కదా....

*పరిష్కారం ఒక్కటే... పెళ్లవకముందే హడావిడి పడకుండా, మన ఆలోచనలకు తగ్గ వారిని చేసుకోవడం... పెళ్లి అయిన తరువాత అర్ధం చేసుకొనే సమయం ఇవ్వడం ద్వారా, ఇద్దరి మధ్య అవగాహన, బంధం రాంకో సిమెంట్ లా దృఢంగా ఉంచుకొనేలా చేసుకోవడం....* లేకపోతే జీవితాంతం సర్దుకోలేక, బతుకు జీవుడా అంటూ లాగించడమే...

దీనికోసం మేము ఇద్దరం వ్యక్తిగతంగా *జీవన విద్య అనే ఉచిత కోర్సు అటెండ్ అయ్యాము. మీరు ట్రై చెయ్యొచ్చు, మీ వైవాహిక జీవితం బాగుండాలంటే.. ఇద్దరూ వెళితే అద్భుతం, కుదరకపోతే ఒకరైన అవగాహన పెంచుకుంటే, కొంత సమస్యలు తగ్గుతాయిగా... అలా అని అదేదో యాడ్ లాగా చిటికెలో మార్పు రాదు.. కానీ సమస్యలు ఎందుకొస్తాయి, ఎలా అవగాహన పెంచుకోవాలో, ఎలా పరిష్కరించుకోవచ్చో అనే జ్ఞానం మనకి వస్తుంది...... మర్చిపోయా మనకి సమయం లేదు కదా మిత్రమా...* నిజమే..లే.. ఎవరి ఖర్మకు, ఎవరు బాధ్యులు.... బాగా సంపాదిస్తూ అనుక్షణం మనస్సాఅంతి లేకుండా భ్రమల్లో బతికెయ్యడమే కదా ఇప్పటి ట్రెండ్... వై దిస్ కళావరి, కళావరి ఢీ.

శుభం భూయాత్.....నా రాతలు, మరిన్ని... http://ammasrinivas4u.blogspot.com/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0


కామెంట్‌లు లేవు: