1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

10, ఏప్రిల్ 2017, సోమవారం

మన సహాయం సముద్రంలో నీటి చుక్కే, కానీ అదిలేకపోయినా సముద్రం నిండదుగ

సమాజ హితం కోసం మీరు, మనం చేస్తున్న కార్యక్రమాలు (చిన్నదైనా, పెద్దదైనా) మీ ఆలోచనా సరళిని, దేశం మీద మీకున్న ప్రేమని తెలియజేస్తాయి. మీలాంటి ఉన్నత ఆశయాలు కలవారితో కలసి పని చేయడం నిజంగా మా (అశ్వ) అదృష్టం.

*మనం చేసే చిన్న చిన్న మంచి పనులు మనకు తెలియకుండానే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మంది జీవితాలలో, వారి కుటుంబాలలో ఆనందాన్ని, వారికి అవసరమైన మానసిక, ఆర్ధిక స్తైర్యాన్ని ఇస్తున్నాయి.*

*మనం పనులు చేస్తూ ఉంటాము గాని, దాని వలన జరిగిన, జరిగుతున్న మార్పును అంచనా వెయ్యము*. అలాగే మనలాంటి వారికి ఈ భావజాలన్ని వ్యాపింప చెయ్యడం కూడా అంతర్గతంగా జరుగుతూ ఉన్నదే.

మన దగ్గర ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు వున్నాయి

*మనం చదివించే విద్యార్థులు ఎక్కువ మంది ఈ రోజు ఉద్యోగాలు చేసుకొంటూ వారి కాళ్ళ మీద వారు నిలబడి, వారి కుటుంబాలను ఆనందంగా చూసుకోవడమే కాకుండా, మంచి విలువలతో తిరిగి సమాజానికి సేవ చెయ్యాలనే భావనతో, మనతో చేతులు కలిపి ఈ గొప్ప ఆలోచనకు చేయూత ఇస్తున్నారు. అంటే సమాజంలో మంచి వ్యక్తిత్వాలను కూడా పెంచుతున్నాము.*

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు అనవసరమైన అలవాట్లకు బానిసలవుతూ, మంచి విషయాలను పక్కకు పెడుతున్నారు, వారి జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. చాలా మందికి ఇంట్లో శ్రద్ద తీసుకొని చెప్పే వారు లేరు. కానీ మన కార్యకర్తలు రకరకాల కార్యక్రమాల ద్వారా వారికి తప్పు వొప్పులు చెప్తున్నారు. తద్వారా కొంత మంది ఇప్పుడే మారుతున్నారు, మరికొంత మంది భవిష్యత్తులో మారే అవకాశం వుంది.

రక్త దానం ద్వారా వ్యక్తిని తద్వారా వారి  కుటుంబాన్ని, హెల్త్ సపోర్ట్ ద్వారా ఆరోగ్యాన్ని తద్వారా వారి  కుటుంబాన్ని ఇలా మన అన్ని ప్రాజెక్ట్ లలో వారు, వారు కుటుంబీకులు ఇలా ఎంతో మందిని మనం స్పృశిస్తున్నాము...

*కాబట్టి మనం అందరం దీనిని గుర్తించి, మరిన్ని మంచి కార్యక్రమాల దిశగా అడుగులు వెయ్యాలి....*

*మన సహాయం సముద్రంలో నీటి చుక్కే, కానీ అదిలేకపోయినా సముద్రం నిండదుగా...*

మీ
అమ్మ శ్రీనివాస్
9948885111
www.aswa.co.in

రోజు నిద్రపోయే ముందు అశ్వ కోసం / సమాజం కోసం నేను ఏమి చేశాను

రోజు నిద్రపోయే ముందు అశ్వ కోసం / సమాజం కోసం నేను ఏమి చేశాను అని ఆలోచిస్తాను. ఏదో ఒక చిన్న పని చెయ్యడం వలన నాకు అస్సలు తృప్తి కలగదు.

*అందుకని సంస్థకి ముఖ్యులైనవారితో ఎవరితోనైనా నా అనుభవాలను పంచుకోవడం,వారు మంచి నాయకులు కావడానికి తోడ్పాటు ఇవ్వడం లేదా కొత్త వారికి మన కార్యక్రమాలను తెలపడం ద్వారా వారిలో ప్రేరణ నింపడం లేదా అశ్వతో కలసి ప్రయాణిస్తున్న దాతలు, సలహాలు ఇస్తున్న వారితో మాట్లాడం ఇలా ఎదో ఒక విలువగల పని చెయ్యనిదే నా మనసుకు తృప్తి, కంటికి నిద్ర రాదు*. అలా అశ్వ నా జీవితంలో విడదీయలేని భాగస్వామి అయ్యింది.

*కార్యక్రమాలు చెయ్యడంతో పాటు భావజాలాన్ని వ్యాప్తి చెయ్యడం, కార్యకర్తలుగా మారడం, మరికొంత మంది కార్యకర్తలను తయారుచేయడం ముఖ్యం.*

ఇది మొదట నా తృప్తి కోసం, నేను నివసిస్తున్న నా సమాజం కోసం నేను చేస్తున్న పని.

*నా ఇల్లు (అనే సమాజం) శుభ్రంగా, ఇంటిలో వారందరు ఆనందంగా ఉంటేనే కదా, అదే ఇంటిలో నివసిస్తున్న నేను కూడా ఆనందంగా జీవించగలను...*

ఈ రోజు నాకెందుకులే, ఎవరో ఎదో చేస్తారులే అని పట్టించుకోక వదిలేస్తే *స్వైన్ ఫ్లూ లాగా అంటుకొని మనం వదిలేసిన దగ్గర నుండే ప్రబలి మన దాకా చేరుకొని, మనము అందులో బలి అయ్యే స్థితికి వస్తుంది. కానీ అప్పుడు శ్రద్ధతో పట్టించుకున్న ఉపయోగం ఏముంటుంది*

కాబట్టి మనం అందరం ఒక్కటై ఈ సమాజ పునర్నిర్మాణంలో మన వంతు సాయం చేద్దాం, పాటు పడుదాం....

*తీరిక సమయం, ఆర్ధిక స్తోమత ఇవి రెండూ  మనం గుంతలోకి పొయ్యే దాకా మనకు దొరకవు, కాబట్టి మనమే సమాజ సేవ కోసం తీరిక చేసుకోవాలి*

మీ అమ్మ శ్రీనివాస్
9948885111
FB : ammaswa
www.aswa.co.in

17, జనవరి 2017, మంగళవారం

లక్ష్యం Vs అలవాటు


మనం తరచూ చేసే పనులను అలవాట్లుగా మారతాయి. అవి పెరిగిన వాతావరణాన్ని, పరిస్తులను, మనుషులను బట్టి ఏర్పడుతాయి. వాటికి లక్ష్యంతో సంబంధం ఉండవచ్చు లేక వుండకపోవచ్చును.

లక్ష్యం అంటే అనుకున్నది (చేరాలనుకున్నది / చెయ్యలనుకున్నది).  ఇకపోతే లక్ష్యాలు (వ్యక్తిగత, వృత్తి పరమైన, ఆధ్యాత్మిక అని రకరకాలు).. కొంతమంది అన్నిటికి కలిపి *జీవిత లక్ష్యం* అని ఒక దాని మీదే ద్రుష్టి కేంద్రీకృతం చేస్తారు కూడా.

మన లక్ష్యం ఏదైనప్పటికీ, మన లక్ష్యానికి మన అలవాట్లు కొన్ని సందర్భాలలో అడ్డు వస్తుంటాయి. అలాంటి సమయాలలో ఎక్కువ మంది మన తరచూ చేసేదే కదా అని అలవాటు వైపు వెళ్తారు, కొంత మంది దేన్ని వదులుకోవాలో అనే సందిగ్ధంలో కూడా ఉంటాము. లక్ష్య సాధనలో ఎప్పటికి లక్ష్యాన్ని వడాలకూడదు. మన మొదట ప్రాధాన్యత లక్ష్యానికే ఇవ్వాలి. లక్ష్యాన్ని సాధించడానికి కావలిసిన శక్తి, సామర్ధ్యాలను ఇవ్వగలిగే అలవాట్లు మంచివే కానీ, లక్ష్యాన్ని పక్కనే పెట్టె  అలవాట్లు ఎప్పటికి మంచివి కావు, ఇవి మన లక్ష్యాన్నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తాయి.

కాబట్టి మీ లక్ష్యం నిర్ణయించుకున్నాక వాటికి అవరోధం కలిగించే అలవాట్లను లక్ష్యం చేరుకొనేదాకా పక్కన పెడితే మంచిదని నా అనంతరంగం చెప్తోంది...

అందుకే స్వామి వివేకానంద గారు ఇలా చెప్పారు

మీ అమ్మ శ్రీనివాస్
1/17/17 12:30 AM

నా రాతలు మరిన్ని చదవాలంటే దయచేసి కింద లింక్ క్లిక్ చెయ్యండి

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

12, జనవరి 2017, గురువారం

విజయం Vs అపజయం

అందరికి, ఎవరైనా సాధించిన, పైన కనిపించే విజయం (sucess) పేరు ప్రతిష్టలు (name & fame) కనబడతాయి.... కానీ విజయం సాధించాలనే పట్టుదల వున్న వాడికి కింద ఉన్న & మనం వంట పట్టించుకోవలసిన క్రింది విషయాలు (బొమ్మలో కూడా కింద దాగి, కనపడని విషయాలు) కనపడుతాయు... అలా కనపడినప్పుడే వారు సంసిద్ధులై విజయం సాధించగలరు... లేకపోతే విజయం వైపు సాగే గమ్యంలో విజయ తీరాలు చేరకుండానే అపజయం ముంగిట ప్రయాణంలో అలసిపోయి, నిలచిపోతారు...

* సాధించాలనే దృఢ సంకల్పం, తపన

* దాని కోసం చేయ్యవలసిన సాధన, పట్టుదల, కృషి

* అలవరచుకోవాల్సిన మంచి అలవాట్లు

* చెయ్యవలసిన త్యాగాలు

* మెట్లుగా మార్చుకోవాల్సిన, మనలని మరింత దృడంగా చేసి, పాఠాలు నేర్పించే  అపజయాలు

* ప్రణాళికా లోపం/ సామర్ధ్య లోపం/ ఓపిక లేమి /తొందర పాటు కారణంగా ఎదురయ్యే నిరుత్సాహాలు

* ఎదో కాసేపు/ కొద్ది రోజులో కాకుండా లక్ష్యాన్ని చేరే దాకా నిరంతరం చెయ్యవలసిన ప్రయత్నం....

వీటన్నిటికీ మించి అంతా మన మంచికే అనే భావన, మన ప్రయత్నం 100% చేస్తూ ఫలితం ఎలాగున్న ఆస్వాదించే గుండె నిబ్బరం ఉంటే మనలని ఆపే శక్తి ఎవ్వరికి లేదు, విజయం నీకు బానిస కావాలిసిందే...

అమ్మ శ్రీనివాస్.... 1/12/17 10:32 AM