1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, సెప్టెంబర్ 2017, శనివారం

మానవుల సహజ పోకడే

వ్యక్తి యొక్క శాశ్వత అభివృద్ధిని కాంక్షించే విలువైన మాటలను వినే స్థితిలో ఈ నాటి స్నేహాలు కనపడడం లేదు... తాత్కాలిక ఆనందాన్ని అందించే వ్యర్ధ వాక్కులను స్వాగతించి, నెత్తిన పెట్టుకొనే స్థితిలో ఉంది..

ఇది మానవుల సహజ పోకడే... మనకి కావాల్సింది తాత్కాలికమే కానీ, శాశ్వతమైనది కాదుగా..

నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్
2017/09/30 13:02

నాలుగు ఊచల్లోంచి బయటకి చూస్తున్నాను...

నాలుగు ఊచల్లోంచి బయటకి చూస్తున్నాను...
చల్లని గాలి, పచ్చని చెట్లు  అలా అలా వెళ్లిపోతున్నాయి, రైలుతో పాటు మాత్రమే కాదు, కాలంతో పాటు కూడా....

ఏసుదాసు గారు అద్భుతంగా ఆలపించిన "ప్రకృతి...ప్రకృతి... ఎంతటి భాగ్యశీలివమ్మా...." అనే పాట లాంటి ఎన్నో ప్రకృతి పాటలు మనసారా వినడానికి ధైర్మ్యం కూడా చాలడంలేదు....

నిజమే మరి.. నాగరికుడు నరికి నరికి నాగరికత లేని చోటుకు పయనించే క్రమంలో.... మూలాలను మరచి, మూన్నాళ్ళ ముచ్చటల కోసం..

మనిషికి కించిత్ స్వార్ధం అవసరమే మరి, కానీ ప్రకృతికి ఇంచి కూడా మిగల్చనంత స్వార్థం అత్యవసరమా లేక అతి అవసరమా ????

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/09/20 23:12

వెనక్కి వాలి ఆలోచిస్తే.....

వెనక్కి వాలి ఆలోచిస్తే..... వెళ్లిపోయిన జీవితం.. కష్టం, సుఖం, బాధ, సంతోషం, ఆనందం,నష్టం,లాభం, పాఠాలు గుణపాఠాలు..... అదో ఉగాది షడ్రుచులు సంగమం... ఫలితం పక్కన పెడితే దీన్ని మనం మార్చలేము.

కానీ... పై అనుభవాల సారంతో ముందుకు తొంగి చూస్తే.. ఎన్నో ఆశలు, ఆశయాలతో అందమైన భవిష్యత్తు.... ఇది మన చేతిలోనే, మనం అనుకున్నట్టు కాకపోయినా, మనం ఆలోచించినట్టు, మనం స్వీకరించినట్టు..

*అందుకే సంకల్పం గొప్పగా, ఆశయం ఆనందంగా, జీవితం తృప్తిగా ఉండాలని కోరుకుందాం.... తప్పేముంది డ్యూడ్....మహా అయితే ప్రతి నిముషం జీవితాన్ని జీవిస్తాం...*

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/09/20 23:37

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

వైజాగ్ టూర్

ఈ 3 రోజులు మా గైడ్, మా అన్నయ్య, మా సలహాదారు అయిన సుందర్ సర్ తో గడపడం ఒక ఎత్తు అయితే...

*ఆయన లాంటి ఎంతో మందిని తీర్చిదిద్దుతున్న గొప్ప జంట గణేష్ జి & అర్చన దీదీ. జీవన విద్య ను జీవితంలో ఆచరించి చూపుతున్న వారివురిని కలిసే అవకాశం, మాట్లాడే అవకాశం చాలా గొప్పది.*

*గణేష్ జి ని జీవన విద్యలో చూసాం, ఎదో ఒక సారి కలసి దగ్గరగా మాట్లాడడం జరిగింది.*

*కానీ అర్చన దీదీతో  3 రోజులు దగ్గరగా ఉండి ఎన్నో సమస్యలకు సూచనలు, సలహాలు పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.*

అలాగే ఎంతో మంది గురువుగా భావించే శ్రీమాన్ అనంత కృష్ణ గారిని కూడా కలవడం గొప్ప విషయమే.

ఇలాంటి అవకాశం ఇచ్చిన సుందర్ సర్ కి మా మంగిడీలు....

దేవుని కరుణ మనపై ఉన్నదా లేదా తెలుసుకోవడానికి

దేవుని కరుణ మనపై ఉన్నదా లేదా తెలుసుకోవడానికి మనకి డబ్బు సంపాదించడానికి ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, వసతులు ఇచ్చాడా అనే దానికంటే ....

ఎంత మంది గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం ఇచ్చాడా, అలాంటి వారిని ఎన్ని ఎక్కువ సార్లు కలిసే అవకాశం ఇచ్చాడా, ఎన్ని ఎక్కువ రోజులు లేదా ఎంత ఎక్కువ సమయం వారితో గడిపే సమయం ఇచ్చి.. వారితో సాన్నిహిత్యాన్ని పెంచి... నిన్ను నువ్వు తెలుకొని మరింత గొప్ప వ్యక్తిగా, నలుగురికీ ఉపయోగపడే వ్యక్తిగా ఎదిగే అవకాశం ఇచ్చాడా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది అని నా ఆనంతరంగం అంటుంది...

ఈ విషయంలో ఎంతో కొంత దేవుని కరుణ మా కుంటుంబం పై ఉన్నదని నా భావన

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/09/24 15:30

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

*ఈ రోజు సమాజంలో అతి పెద్ద రోగం, ఎవరి శక్తి సామర్ద్యాల మీద వారికి నమ్మకం లేకపోవడం

రోజూ పడుకోబోయే ముందు మనం ఇతరులకు ఏమి సహాయం చేసాం లేదా ఏమి మంచి పని చేసాం అని ఆలోచించాలి. ఇది చాలా మంచి విషయం.

*కానీ దీనికంటే ముందు మనం మనలోని సామర్ధ్యాలను పెంచుకువడానికి, మనలోని మంచిని పెంచుకోవడానికి, మనలోని చెడును తగ్గించుకొని, లోపాలను సరిదిద్దుకివడానికి మనం ఏమి చేసాం అని ఆలోచించడం* ఇంకా ముఖ్యమైన విషయం అని నాకనిపిస్తుంది.

*అంటే నిన్ను నువ్వు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా మార్చుకోవడానికి, నీ కోసం, నీ అభివృద్ధి కోసం  ఈ రోజు నువ్వు చేసిన పని ఏమిటి.....*

ఎవరూ... ఎవరికీ.. ఏమి చేయకపోయినా... ఎవరికి వారు మంచిగా మారితే చాలుగా... సమాజంలోని కుళ్లును కడగాలి అనుకునే ముందు, *మనలోని కుళ్లును మనమే శుభ్రం చేసుకొంటె సరిపోద్దిగా....*

*ఈ రోజు సమాజంలో అతి పెద్ద రోగం, ఎవరి శక్తి సామర్ద్యాల మీద వారికి నమ్మకం లేకపోవడంతో పాటు ఎవరి తప్పులను వారు సరిదిద్దుకోలేకపోవడమే* అని నా అభిప్రాయం...

అందరికి విజయ దశమి శుభాకాంక్షలు.....

నా అనంతరంగం .. అమ్మ శ్రీనివాస్.. 2017/09/29 23:15

చదువుకొనే వయస్సులో పండగ అంటే ఎంతో హడావిడి

చదువుకొనే వయస్సులో పండగ అంటే ఎంతో హడావిడి చేసే వాళ్ళం. అన్ని పనులు మనమే చేసే ఉత్సాహం ఉండేది.

కానీ ఉద్యోగాలలో పడ్డ తరువాత....  పండగకి ఊరికి వెళ్లడం ఒక ఎత్తయితే.. వెళ్లిన తరువాత ఒకప్పటిలాగా పాల్గొనడం తగ్గిపోగా, వెళ్ళగానే నిద్రపోవడానికి, ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తూ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తాం.....

ఇది నిజమేనా..... నాకు తెలిసిన వారిలో దేనికి కొందరు ఎక్సేప్షన్....

నా అనంతరంగం.. అమ్మ శ్రీనివాస్  2017/09/30 12:52

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

చదువుకొనే వయస్సులో పండగ


చదువుకొనే వయస్సులో పండగ అంటే ఎంతో హడావిడి చేసే వాళ్ళం. అన్ని పనులు మనమే చేసే ఉత్సాహం ఉండేది.

కానీ ఉద్యోగాలలో పడ్డ తరువాత.... పండగకి ఊరికి వెళ్లడం ఒక ఎత్తయితే.. వెళ్లిన తరువాత ఒకప్పటిలాగా పాల్గొనడం తగ్గిపోగా, వెళ్ళగానే నిద్రపోవడానికి, ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తూ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తాం.....

ఇది నిజమేనా..... నాకు తెలిసిన వారిలో దేనికి కొందరు ఎక్సేప్షన్....

నా అనంతరంగం.. అమ్మ శ్రీనివాస్ 2017/09/30 12:52

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

21, సెప్టెంబర్ 2017, గురువారం

అత్యవసరమా లేక అతి అవసరమా ????

నాలుగు ఊచల్లోంచి బయటకి చూస్తున్నాను...
చల్లని గాలి, పచ్చని చెట్లు  అలా అలా వెళ్లిపోతున్నాయి, రైలుతో పాటు మాత్రమే కాదు, కాలంతో పాటు,కాలగర్భంలోకి కూడా....

ఏసుదాసు గారు అద్భుతంగా ఆలపించిన "ప్రకృతి...ప్రకృతి... ఎంతటి భాగ్యశీలివమ్మా...." అనే పాట లాంటి ఎన్నో ప్రకృతి పాటలు మనసారా వినడానికి ధైర్మ్యం కూడా చాలడంలేదు....

నిజమే మరి.. నాగరికుడు నరికి నరికి నాగరికత లేని చోటుకు పయనించే క్రమంలో.... మూలాలను మరచి, మూన్నాళ్ళ ముచ్చటల కోసం..

మనిషికి కించిత్ స్వార్ధం అవసరమే మరి, కానీ ప్రకృతికి ఇంచి కూడా మిగల్చనంత స్వార్థం అత్యవసరమా లేక అతి అవసరమా ????

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/09/20 23:12

14, సెప్టెంబర్ 2017, గురువారం

3వ వ్యక్తి సమస్యని పెంచేవారా లేదా పరిష్కరించి, సంబంధాలను పునరుద్ధరించేవారా?

ఏ ఇద్దరు బంధువులు కలుసుకున్నా....
ఏ ఇద్దరు స్నేహితులు కలుసుకున్నా...
ఏ రెండు కుటుంబాలు కలుసుకున్నా...
ఏ ఇద్దరు ఉద్యోగులు కలుసుకున్నా...

కుటుంబం అయినా, సంస్థయినా, స్నేహ బృందం అయినా, ఉద్యోగస్తుల సమూహం అయినా (అందరూ అని అనలేం కానీ, ఎక్కువ శాతం మంది) తరచూ కానీ, అప్పుడప్పుడు కానీ కలుసుకున్నపుడు ఒక మంచి సహృద్భావ వాతావరణంలో ఉండక, మంచి విషయాలు చర్చించక, మంచిని, మంచితనాన్ని ప్రోత్సహించక.. తమలో వుండే లోపాలను, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం, సానుభూతి పొందడం కోసం, తమ వాదాన్ని బలపరచుకోవడం కోసం, తమ ఆహాన్ని చల్లార్చుకోవడం కోసం, మానసిక పరిపక్వత లేక, పూర్తిగా తెలుసుకోకుండా, తెలిసీ తెలియని తనంతో, తమ ఆలోచనల ఆధారంతో...లేనిది ఉన్నట్టు, వున్నది లేనట్టు, తెలియనిది తెలిసినట్టు, తెలిసిన తెలియనట్టు... చెడును ప్రోత్సాహిస్తూ, వ్యాప్తి చేస్తూ మనుషుల మధ్య, మనసుల మధ్య నిర్మించుకోలేని అంతరాలు కట్టడానికి నాంది పలుకుతున్నారు.

వీరు చేసే ఈ చిన్న తెలివి తక్కువ పని వల్ల చెడు వ్యాపించి ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న భంధాలు, బంధవ్యాలు, కుటుంబాలు, సంస్థలు ఎన్నో కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. పాపం వారికి తెలీదు మన చిన్న చర్చ వల్ల ఇంత జరుగుతుంది అని, ఎందుకంటే వారికి మానసిక పరిపక్వత లేదు కాబట్టి...కొంత మంది తెలిసీ చేస్తారు అలాంటి వారిది నిస్సందేహంగా చెడు ఆలోచన, చెడు స్వభావమే...

3 వ వ్యక్తి ఏమి చెయ్యాలి ...

- మనస్పర్థలు వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న మంచి సంబంధాన్ని గుర్తు చేస్తూ, ఆ బంధాన్ని పెంపొందించే విధంగానో లేదా

- ఇతను (3వ వ్యక్తి దగ్గరకు వచ్చి చర్చిస్తున్న వ్యక్తి) తప్పుగా ఆలోచిస్తుంటే నీ ఆలోచన తప్పు అని చెప్పగలగడమో లేదా

- అసలు సమస్య ఎందుకు వచ్చింది దానిని పరిష్కరించుకోవడానికి 3వ వ్యక్తి దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏమి చెయ్యాలని సూచన చేసే విధంగానో లేదా

- అవతలి వారిది తప్పు అని తెలిసినప్పుడు, తన దగ్గరకు వచ్చిన వ్యక్తే నేరుగా వెళ్లి ఇబ్బంది / మనస్పర్థలు ఉన్న వారితో చర్చించడం ద్వారా దానిని పరిష్కరించడానికి ... వారిద్దరే ఎలా భాద్యత తీసుకోవాలో చెప్పాలి. ఎలా సహృద్భావ వాతావరణాన్ని, బంధాన్ని ఏర్పరుచుకోవాలి చర్చించాలి.

మొత్తం మీద అవతలి వారు మరింత వెధవ అని నిర్ణయించే విధంగానో, వ్యవస్థ, సంస్థ, కుటుంబం మంచికాదు అని తీర్మానించడానికో కాకుండా మంచిని,మానవత్వాన్ని,  పోసిటీవిటీనీ పెంచి, ఆ భాధ్యతను తనే  తీసుకొని సమస్యకి పరిష్కారం కనుగొని, బంధాలను తిరిగి పునరిద్దరించుకొనే విధంగా అతనికి సూచించే విధంగా 3వ వ్యక్తి పాత్ర ఉండాలి.*

భావజాల వ్యాప్తి ఎంతగా పని చేస్తుందో చూడండి. ఇది సహజంగా మనందరం చూస్తూ ఉన్నదే, తెలిసినదే.... చెడుకు బదులు మంచిని పెంపొందిస్తూ పోతే అసలు ఇలాంటి అపార్ధాలు సమస్యలుగా మారవు.

*మనం చేసే ఏ పనిలో నైనా మంచిని పెంపొందింస్తూ, అందరిని ఒకే కుటుంబంగా దగ్గర చేయడమే మనం ప్రతి ఒక్కరం చెయ్యవలసిన కనీస పని. అది స్నేహంలో అయిన, కుటుంబంలో నైనా, ఉద్యోగంలోనైనా, సంస్థలోనైనా.....*

నా రాతలు మరిన్ని చదవాలంటే దయచేసి కింద లింక్ క్లిక్ చెయ్యండి
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0