1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, జూన్ 2020, శనివారం

సేవ అంటే సమస్యను నిర్మూలించడం కోసం పనిచెయ్యడమేనా?

మనం అందరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఏదైనా సంఘటనను లేదా ఎవరైనా వ్యక్తులను వివిధ పరిస్థితులలో చూసి, చలించి వెంటనే మనకు చేతనైన సాయం చేస్తాం, ఆ సాయం ఎంతో గొప్పది, సాయం అందుకున్న వారిని తాత్కాలికంగా (కొన్ని క్షణాలు/ గంటలు/ రోజులు/సంవత్సరాలు) నిలబెడుతుంది. కొంత కాలం తరువాత వారి పరిస్థితి మళ్లీ మాములే. *ఆ పరిస్థితిని చూడగానే మనలో కలిగే భావోద్వేగాల (Emotional Connect) వలన మనం చేస్తుంటాము.* చాలా వరకు స్వచ్చంద సంస్థలు, సేవా భావం కల వ్యక్తులు ఇదే పని చేస్తున్నారు. ఇది చాలా అవసరం కూడా.

ఇప్పుడు మనందరం చేయాల్సింది... *మనం మరో మెట్టు పైకి ఎక్కి పని చెయ్యాలి. అలా చెయ్యాలంటే, మనం భావోద్వేగాల దగ్గర ఆగిపోకుండా, ఆ సమస్య మన మనసుకు హత్తుకోవాలి (Connecting to the Cause).* ఎప్పుడైతే ఆ వ్యక్తిని కాక, సమస్యను చూస్తామో, అప్పుడు మనం ఆ సమస్య మొదట ఆ వ్యక్తికికే రాకుండా...తర్వాత ఎవ్వరికీ, ఎప్పటికి రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయుడమే కాదు, అసలు ఆ సమస్య కోసం పని చేస్తున్న వారితో కలసి ఆ సమస్యను సమూలంగా నిర్మూలించే విధంగా పనిచేస్తాం. ఇదే అసలు మనం చెయ్యాల్సిన పని. అలా చెయ్యలేక పోవడం వలననే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది కష్టపడుతున్నా కానీ సమస్య అక్కడే ఉంటోంది, దానికి ఎంతో మనిషి బలైపోతున్నారు.

*కాబట్టి*
1. *సమస్యను గుర్తించడం*
2. *సమస్యను ప్రచారం చెయ్యడం*
3. *సమస్యను నిర్మూలించడం*

కాకపోతే ఎక్కువ శాతం, వ్యక్తిగత లేదా సంస్థ లకి ప్రచారం చేసుకోవడం దగ్గరే ఆగిపోతున్నాం. అది ఏమి తప్పు కాదు, అది కూడా అవసరమే.

మరి.... మన ప్రయాణం *మొదటి దశను*(సమస్యను గుర్తించడం) ఎప్పుడు దాటుతుందో... *చివర దశను* (సమస్య నిర్మూలన) ఎప్పుడు చేరుకుంటుందో చూడాలి..

*మనం చివరి దశ చేరుకోక పోయినా పర్లేదు...*
సమస్యను నిర్మూలించలేకపోయినా పర్లేదు.... *కానీ... మన పయనం, మన ప్రయత్నం మాత్రం మన లక్ష్యం ("సమస్య నిర్మూలన")  వైపు చెక్కు చెదరక ఉంటే చాలు...*

మీ అమ్మ శ్రీనివాస్...
జూన్ 6, 2020 12.10am

*అప్పుడప్పుడు నా అనంతరంగం యొక్క ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది, అవన్నీ ఈ బ్లాగ్లో ఆవిష్కరించటం జరిగింది. మీకు ఇంకా తనివి తీరకపోతే, నా మరిన్ని రాతల కోసం సందర్శించండి* http://ammasrinivas4u.blogspot.com/

Donated Blood for the _*46th time*

రక్తదానం అనేది ఒక మహత్తర కార్యం,
3 నెలలకు ఒకసారి అలా చేయడం అనివార్యం,
కాదా ఇది పూర్వజన్మ సుకృతం,
మనకి దేవుడిచ్చిన వరం,
అలా చెయ్యకపోతే నాలో నాకు మొదలవుతుంది రణం-మనసు అవుతుంది కకలావికలం-ఆ బాధ వర్ణనాతీతం,
ఎందుకంటే తలసీమియా భాదితులకు ప్రతి 15 రోజులకు రక్తం ఎంతో అవసరం,
ఎవరు చెప్పినా ఒకటే-ఇదొక బృహత్కార్యం,
మరెందుకాలశ్యం, అనుమానం? మొదలెడుదాం మనందరం ఈ క్షణం,

Donated Blood for the _*46th time*_ yesterday in the 35th Blood Donation Camp of Amma Social Welfare Association (ASWA) with *blessings of my mother*.

SPECIAL Thanks to www.aswa4u.org / www.aswa.co.in

అందరిని ప్రేమించు - అందరిని సేవించు
అమ్మ శ్రీనివాస్

5, జూన్ 2020, శుక్రవారం

44 వ సారి రక్తదానం నా అదృష్టం

*3 నెలల కి ఒక సారి రక్తం ఇవ్వకపోతే, ఏదో కోల్పోయిన ఫీలింగ్. నిజమే కదా! 3 ప్రాణాలని కాపాడే అవకాశం కోల్పోయినట్టే కదా...* నిన్న టికెట్ క్యాన్సల్ చేసుకొని, వేరే మార్గంలో ప్రయాణం కుదుర్చుకొని, *ఎట్టకేలకు ఈ రోజు మిస్ అవకుండా 44వ సారి రక్త దానం చేయడం, నిజంగా నాకు దేవుడిచ్చిన వరం.*

రక్తం ఇవ్వగానే విప్రో పార్టనర్స్ సదరన్ నెట్వర్కింగ్ మీటింగ్ కోసం విజయవాడ మీదుగా పోండిచేరీ బయలుదేరాను, రేపు ఉదయం 5 గంటల దాకా ప్రయాణంలోనే. అయినా అదో తుత్తి...

*నాకోసం కొంచెం తొందరగా వచ్చి నా రక్తాన్ని స్వీకరించిన అశ్వ సేవ్ లైఫ్ టీం అండ్ TSCS వారికి నా కృతజ్ఞతలు.*

*మరి మీరు రండి... రక్త దానం చెయ్యండి-ప్రాణ దాతలుకండి. ఈ రోజు 12.30 దాకా కాంప్ జరుగుతుంది.*

మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org

ఈ రోజంతా ప్రయాణం

With Gods grace i am able to donate Blood for the "44th Time" in a blood camp conducting by www.aswa4u.org today.

You too can donate blood.

Love all-Serve all
9948885111

జూన్, 2019

Don't you donate blood?

So called *EDUCATORS and EMPLOYEES* keep calling us requesting Blood in emergencies. We can understand their need, but *they need to think on...*

*"why they calling us without"*

- *Donation* by themselves

- *Referring their* friends, colleagues, Relatives

- Posting on their *FACE BOOK STATUS* (it has separate feature too)

- Posting on *their WALLS* and Many *WHATSAPP groups*

- even *donating* after their requirement is fulfilled

- *Promoting Blood Donation and Volunteering* to bridge the donors and requirements, If they are not eligible to donate

*Blood never be manufactured in the Body / homes of Blood Donor...*.

*Every eligible person has to donate blood regularly for every 3 or atleast 6 months*

*ఏరు దాటగానే, తెప్ప తగులబెట్టే ఆలోచలనలతో, వైఖరితో ఎన్నాళ్ళు బ్రతికి ఏమి ఉపయోగం...*

Love all-Serve all
Amma Sreenivas
99 4888 5111
www.aswa4u.org

Happy Birthday

తండ్రి, కూతురు ఒకే రోజు పుడితే, పుట్టిన రోజు జరుపుకుంటే...అది భలే తమాషాగా, డిఫరెంట్ గా ఉంటుంది.ఏదో ఒక రకమైన బహుమతిలా ఉంటుంది. తండ్రి కూతురి పుట్టిన రోజు ప్లానింగ్ లో బిజీ అయిపోతారు.

ఆత్మేయులకి మాత్రం ఒక ఫోన్ కాల్ తో రెండు విషెస్ లతో పనైపోతుంది. అలాంటిదే ఈ రోజు.

నన్ను, నా కూతుర్ని విష్/ బ్లెస్ చేసిన సహృదయులకు, ఆత్మేయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు.

మీ అమ్మ శ్రీనివాస్
99 4888 5111

20.12.2019

మా చిట్టితల్లితో పుస్తక ప్రదర్శనకు

వారం రోజుల నుండి ఒకటే ప్రయాణాలు... త్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు ఒక పక్క అద్భుతమైన షిరిడీ, నాసిక్, త్రయంబకం, ఘృష్ణేశ్వరం, ఎల్లోరా దర్శనాలు మరో పక్క... ఈ రోజే హైదరాబాద్ చేరుకున్నాం. నేరుగా షాద్ నగర్ వెళ్లే ఆలోచన కొద్దిగా వాయిదా వేసి మా చిట్టితల్లిని పుస్తక ప్రదర్శనకు తీసుకెళ్లాలనే ఆలోచన... మాకు వెళ్లాలనే ఎందుకంటే ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి.

ఎట్టకేలకు 12.30 కి NTR స్టేడియం చేరుకొని ఒక గంటలో అన్నీ చుట్టేసి వెళ్లిపోవాలని అద్భుతమైన ప్లాన్ వేసా, కానీ ఏమీ లాభం.

లోపలికెళ్లి ఒక్క స్టాల్ దగ్గరే దాదాపు 2 గంటలు గడిచిపోయాయి. నేను, నా కూతురు, మా ఆవిడ అందరం ఎవరికి తోచిన పుస్తకాలు వారు తీసుకోని, చదువుకొని, తిరిగేసే పనిలో పడిపోయాం. ఈ లోపు తమ్ముడు Naresh Padmaraju మాతో కలిసాడు.

మాలో, మా పాప లో పుస్తక పఠనం పట్ల ఆశక్తిని కాపాడుకోవడానికి ఇలాంటివి తరచు చాలా ఉపయోగపడతాయి సుమీ. కాకపోతే ఇంకా 300 కి పైగా ఉన్న షాప్ లు ఎప్పుడు చూడాలో ఏమో అనుకుంటూ... సమయం అయిపోతు ఉండడంతో నిరాశతో, మళ్ళీ ఒక రోజు రావాలనే ఆశతో వెనుదిరిగాం.

మా చిట్టిది పుస్తకాలు చూసేస్తూ, బుల్లి చేతులతో తాకుతూ, అటు ఇటు తిప్పుతూ, వాటిని చదివి (చూసి) అది ఉంది, ఇది లేదు అనుకుంటూ లీనమై పోయి బాగా ఎంజాయ్ చేసింది. దాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. పిల్లలకి మనం బుక్స్ కొనడం వేరు. వారి ఆలోచనలకు తగ్గట్టు వారు చూసి, కావలసినవి ఎన్నుకొనడం వేరు.

ఇక మా టీచర్ అమ్మ Haritha Vemulapalli సంగతి తెలిసిందే కదా, పిల్లలకి ఏవి సరిపోతాయో, ఏవి సరిపోవు... అలాగే తనకోసం కొన్ని అని తెగ వెతుకులాట......

మీకు, మీ పిల్లలకు మీరిచ్చే అద్భుత గిఫ్ట్ ఇదే సుమీ... కొనడం, కోనకపోవడం, అనవసరంగా కొనడం తరువాత సంగతి... ముందు వెళ్ళండి..

అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org

December, 2019

నా అభివృద్ధి కోసం 10 రోజులు

నా జీవితంలో నా అభివృద్ధి కోసం 10 రోజులు కేటాయించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే వర్కుషాప్ పూర్తి అయిన తరువాత మన అభివృద్ధి కి కావాల్సిన, చెయ్యవలసిన, చెయ్యగలిగిన వాటి గురించి తెలిపే విషయ పరిజ్ఞానం మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకొని... జీవితాన్ని మరింత ఆనందంగా గడపగలమనే ఆనందంతో, నా గురించి నేను మరింత లోతుగా అధ్యయనం చేసుకున్న అనుభవాలతో కాన్పూర్ నుంచి తిరుగు ప్రయాణం.

ఇది తెలుసుకోలేక, చెప్పినా వినే తీరిక, ఓపిక లేని స్థితిలో, సమాజంతో పాటు ఎటో కొట్టుకొనిపోతున్నాము. మన నిజమైన అవసరాలు ఏమిటో గుర్తించక, డబ్బే సర్వస్వం అనుకొని, సంతోషాలను, బంధాలను తాకట్టు పెట్టి... 1 గంట కూడా మన అభివృద్ధి కోసం కేటాయించుకోలేని సమాజంలో... నాకు ఇలాంటి అవకాశం దొరకడం, నేను దానిని ఉపయోగించుకోవడం నిజంగా నా అదృష్టమే కదా...


మీ అమ్మ శ్రీనివాస్...
 2020/01/25 18:47 

5 వసంతాలు పూర్తి

ఈ రోజుకి 5 వసంతాలు పూర్తి చేసుకున్నాం. మాది సేవా వివాహం అని తెలిసిందే కదా... అయినప్పటికీ మేము ఈనాటి సమాజంలో ఉన్న అమ్మాయి, అబ్బాయిలమే కదా..... ఆలోచన, అభిప్రాయభేధాలు, భిన్న లక్ష్యాలు మాములే...

కానీ....అలాంటి మమ్మల్ని ఒకరినొకరు బాగా అర్ధంచేసుకుంటూ, ఒకే లక్ష్యం వైపు, పరిస్థితులను, పరిసరాలను అర్ధంచేసుకుంటూ, ఓపిక, సహనంతో వుంటూ... సంబంధాలకు, అనుబంధాలకు విలువనిస్తూ, డబ్బే జీవితం కాదు అని గుర్తు చేస్తూ... జీవన పయనంలో నిరంతర సంతోషం కోసం ప్రయత్నించే విధంగా ముందుకి తీసుకెళ్తున్నది మాత్రం జీవన విద్య (Universal Human Values) అనే జ్ఞానం.

అలాగే ఇద్దరం కలిసిచేసే ప్రయాణంలో మాలో మేము, అలాగే కుటుంబంతో కలసి వున్నప్పుడు, మనుషులు ఒకరికొకరు అర్ధమయ్యేవరకు కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి... అలాగని వాటిని భరించే సహనం, ఓర్పు లేకుండా మనుషులను దూరం చేసుకోవడం, వదిలెయ్యడం కాకుండా... ఎలా కలిసి, కలుపుకుపోవాలో కూడా నేర్పింది ఈ జీవన విద్యే...

మొత్తంమీద జీవన విద్య మా ఆనందమయ వైవాహిక జీవితానికి పునాది వేసింది, జ్ఞానాన్ని ఇస్తోంది.

*ఇలా ఉండాలనేది మా లక్ష్యం*

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మీ అమ్మ శ్రీనివాస్
08.03.2020

మేము మారం-మేము మనీశులం- మాదంతా వినాశ కులం (మాలో చాలా మందిది మూర్ కులం కూడా)

*మేము మారం-మేము మనీశులం- మాదంతా వినాశ కులం (మాలో చాలా మందిది మూర్ కులం కూడా)*

ఏంది భయ్యా ఇంత నెగటివ్ గా ఉంది...  మనం ఎక్కువ మంది ఇలానే ఉన్నాం, ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం... మన నిజ స్వరూపం మనకు తెలియంది కాదుగా... పైపైనే కవరింగ్ లు చేసేసుకుంటూ... గడిపేస్తున్నాం... కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో జంతు, పక్షి జాతులు నాశనమైనా, మనం మటుకు శిలేసుకొని, మృత్యుంజయులమనే భావనతో పోతా...ఉన్నాం...  

వరదలకి మారామా...!
వడగండ్లకి మారామా...!
భూమి కంపిస్తే మారామా...!
ఉపద్రవాలకి మారామా...!
ప్రకృతి వైపరీత్యాలకి మారామా....!
సునామీకి మారామా...!
గ్లోబల్ వార్నింగ్ కి మారామా...!
సహజ వనరులు తగ్గితే మారామా...!
కాన్సర్, అల్సర్లకు మారామా...!
అప్పుడేప్పుడో కలరా కదిలించినా - 
ఇప్పుడు కరోనా వచ్చినా !
అబ్బే మేము మారుతామా...??? "మేము మారం"

కర్ఫ్యూ అన్నా, కరోనా అన్నా, ఎవరు ఏమన్నా మేము మటన్ షాప్ ల ముందు బారులు తీరుతాం... తిరిగి మేమే మార్చురీలలో మాంసం ముద్దలవుతాం... అయినా "మేము మారం"

మట్టిని, చెట్టుని, పిట్టని, చివరికి మనిషిని... నానావస్థలు పడి, ఎలాగైనా సరే ఆ... నాలుగు అవస్థలను అస్తవ్యస్థం చేస్తాం, సామరస్యాన్ని సమాధి చేస్తాం,  అస్థిరమైన మన అస్థిత్వాన్ని చాటుకొంటాం, చివరికి మా నోట్లో మేమే మన్ను కొట్టుకుంటాం.... ఎందుకంటే సృష్టి మొత్తం మేమే, మా కోసమే అన్న అహం...  అందుకే "మేము మారం"

పాత పద్ధతులు చేదంటాం, విజ్ఞానం లేదంటాం, అన్నిటినీ ప్రశ్నిస్తాము, దేనిని ఆచరించం, మంచి ఎక్కడో గ్రహించం, అన్నిటికి పెటెంట్ అంటాం, లేకపోతే గుడ్డిగా నమ్మమంటాం... జ్ఞానానికి, మతానికి, మనిషికి, మానవత్వానికి ఏవేవో లింకులెడతాం, మా వాదమే నిజమంటాం... చివరకి అటు ఇటు కానీ మనుషులం అవుతాం... తెలుసుగా "మేము మారం"

మనం మారకుండా, మనల్ని నియంత్రించు కోకుండా ఏదో విధంగా సమస్యకు ఒక (తాత్కాలిక) సమాధానం కనిపెడతాం, ప్రకృతితో పరాచకాలు ఆడుతాం, ఏవేవో అరాచకాలు చేస్తాం, బాధ్యత మరుస్తాం, తరచు ఇలా భయంతో వణికి చస్తాం......అయినా "మేము మారం"

మనల్ని, మన తోటి మనుషులను అర్ధం చేసుకొనే జ్ఞానమే మనకు లేదు... ఇక ప్రకృతిని, దాని నియమాలను, సృష్టి రహస్యాలను ఏమి అర్ధం చేసుకోగలం... కానీ... అన్నీ తెలుసనో, తెలుసుకోగలమనో అహంభావంతో ప్రపంచాన్ని పాలించాలంటామ్, తెలిసీ తెలియక తనువు చాలిస్తాం... ప్రకృతిని ప్రేమిస్తే, గౌరవిస్తే అన్నీ తెలుసుకోవచ్చు అనే చిన్న విషయాన్ని మరుస్తాం...ఎన్ని జరిగినా "మేము మారం"
 
మనుషుల మధ్య బంధాలను విస్మరిస్తాం, ఏదేదో గ్రహాల మధ్య దూరాలను విశ్లేషిస్తాం...ఇంటిలో మనుషుల మధ్య మొదలలై, దేశాల సరిహద్దుల దాకా జరిగే ఆధిపత్య పోరులో అశువులు భాస్తాం... ఇంతకీ ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చాం, ఎందుకు ఆరాటం, దేని కోసం పోరాటం...ఏమో ఎవరికి తెలుసు ? పాడే ఎక్కినా తెలీదు, ఎక్కిన వారిని చూసైనా అర్ధం చేసుకోము. పోనీ కాసేపటి స్మశాన వైరాగ్యమైనా కానరాదాయే.... తెలిసిన జ్ఞానులము కాదు, తెలుసుకోలేని గొర్రెలము కాము...తెలుసుకొనే సమయము, సహనము రెండు లేవాయే... వీటికితోడు ఎవరికి వారు తామే గురువు అనే భావన...

ప్రకృతితో ప్రేమగా జీవించే మార్పు మా DNA లో లేదంటామ్, రాదంటాం.... మా అలవాట్లను, పద్దతులను మార్చుకొకుండా పని జరగాలంటాం. కానీ ఇలా ప్రకృతి కన్నెర్ర చేస్తే... ఇంకేం చేస్తాం.... చెయ్యకపోతే కలిసి కట్టుగా చస్తాం... ఇంకెంతకాలం మారకుండా ఉంటాం.... 

*మనిషి నేనొక్కడినే అనే భావనలో కాకుండా...  ప్రకృతితోను, అందులోని అన్ని జీవరాసులతోనూ కలిసి, మమేకమై సామరస్యంతో  ఆనందంగా మనుగడ సాగించడమే మానవ జీవిత లక్ష్యం. దానిని తెలియచెప్పి, అర్ధంచేయించి (చదువు), ఆచరించేట్టు (సంస్కారం) చెయ్యడమే మన విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి పరిశ్రమలకు ఉద్యోగస్తులనే కాకుండా, మనిషిగా సామరస్యంతో  జీవించే మనుష్య జాతిని తీర్చిదిద్దడం ఈ విద్యకే సాధ్యం, ఈ మార్పుకు విద్యా రంగమే తొలి మెట్టు...* ఇదే నా ఆనంతరంగం... మీ అమ్మ శ్రీనివాస్...  2020/03/22 01:32