మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
31, ఆగస్టు 2010, మంగళవారం
అందచందాలు
సౌందర్యం ఎప్పుడూ సమ్మోహనకరమైనదే. అంతరంగాన్ని సంతోషతరంగితం చేసేదే. ప్రాగ్దిశాసుందరి నుదుట దిద్దుకున్న సిందూర తిలకంలా- వేకువనే ఉదయించే భానుబింబపు అరుణిమలోని అందం నిత్యనూతనం. కడలి కన్నె చీరకుచ్చిళ్లు జీరాడుతున్నట్లుగా పరుగులిడుతున్న కెరటాలపై ఉషోదయాన ప్రసరించే నారింజరంగు కాంతిపుంజాల మిలమిలల్లోని సొగసు అనుపమానం. అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా- పసిపాపడి లేత పెదవుల చివరల తళుక్కుమని మెరిసే మందస్మితం సొబగు అసమానం. లాల పోసి, ముస్తాబు చేసి, ఉయ్యాల్లో బజ్జోపెట్టిన అమ్మ అటువైపు తిరిగేలోగానే- కలువ రేకులవంటి కళ్లను అరచేతులతో నులుముకొని, పాలబుగ్గల నిండా కాటుక గంధాన్ని పులుముకొన్న చిట్టితల్లి వదన తేజస్సు అద్వితీయం. ఆ సౌందర్యం ముందు- నీలిమబ్బుల చాటునుంచి తొంగిచూసే చంద్రబింబం అందం ఏపాటిదనిపిస్తుంది. 'వాళ్లమ్మ ఆలాగు వెళ్లొచ్చేసరికి/ కళ్ల, చెక్కిళ్లా కాటుకలు పాకె/... చిలిపి కళ్లమీద, చెక్కిళ్లమీద/ ముంజేత కాటుకలు ఎవరు పూసేరో' అన్న కృష్ణశాస్త్రి కవిత గుండె తలుపులు తట్టి మురిపిస్తుంది. ఆడపిల్లల అరచేతుల్లో గోరింటాకు వికసింపజేసే ఎర్రని వెన్నెలది అనిర్వచనీయమైన అందం. అరుణకాంతులు వెదజల్లే అరచేతులు- ముఖ్యంగా స్త్రీమూర్తులవి- అనాదిగా కవులు తనివితీరా వర్ణించినవే. 'తరుణాంగుళీచ్ఛాయ దంతపు సరికట్టులింగలీకపు వింత రంగులీన'- వీణ మీటుతున్న చదువులతల్లిని తన అక్షరాల్లో మన కళ్లకు కట్టాడు ఆంధ్ర కవితా పితామహుడు పెద్దన. అది- కెంజాయ వన్నెకు దీటైన తన వేళ్లతో మాణిక్యవీణపై శారదాంబ సరిగమలు పలికిస్తున్న అద్భుత దృశ్యం. ఆ వీణ మెట్లు తెల్లని దంతంతో చేసినవి. వాటిమీదుగా సాగిన తీగెలపై సరస్వతమ్మ వేళ్లకొసలు నాట్యమాడుతున్నప్పుడు- ఆమె వేళ్ల ఎర్రదనం, వీణ మెట్ల స్వచ్ఛ ధవళవర్ణం రెండూ కలగలిసి తెలుపు, ఎరుపు రంగులు వింత వింత కాంతులు ప్రసరించాయన్నది అల్లసానివారి మనోజ్ఞమైన అల్లిక!
పెద్దనామాత్యుని అక్షరాల అల్లికలోని జిగిబిగి- ఆడపిల్లల చిన్నెలకు మరింత మెరుగులు దిద్దే జడ అల్లికలోనూ ప్రత్యక్షమవుతుంది. అందానికే అందం అనిపించే వాల్జడను మాటిమాటికీ ఇరు భుజాల మీదుగా ముందుకు వేసుకుంటూ నిలువుటద్దం ఎదుట నిలబడిన పడుచుపిల్ల సోయగం ఎంత చూడముచ్చట! 'అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయసీ!/ అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి' అంటూ చెలికాడు కవ్విస్తే- ఆ కన్నెపిల్ల బుంగమూతిలోని ఉడుకుమోత్తనంలో ఎంత అందం! మనసు నవనవోన్మేషంగా ఉండాలేగాని, అటువంటి చిలిపి సరసాలకు వయసుతోనూ పనిలేదు. 'మొకం చూసుకొందుకి ఒక అద్దం చాలు/ కొప్పు చూసుకొందుకి రెండుంటేనే మేలు' అంటూ ఆటపట్టిస్తున్న తాతగారివైపు 'తమరి ఎకసెక్కాలకేమొచ్చెలే' అన్నట్లుగా చురచుర చూసే బామ్మ చిరుకినుక మనోహరమనిపించదూ! గోడపై వేలాడుతున్న అద్దంలోనుంచి కనబడుతున్న మరో అద్దంలో చూసుకుంటూ- తల కొప్పును సవరించుకునే వేళ, ఆ పెద్ద ముత్తయిదువ చేతి కదలికలు ఎంత కళాత్మకమో! అందానికి రంగుల భేదం లేదు. ఏడువర్ణాలూ కలిస్తేనే కదా ఇంద్రధనుసైనా వన్నెలీనేది? ఆస్వాదించగల రసజ్ఞతగల మనుషులకు అన్ని రంగుల్లోనూ సౌందర్య ఝంఝ కనిపిస్తుంది. వరసైనవారిని సరదాగా ఆటపట్టించడానికి వారి ఒంటి చాయను అడ్డం పెట్టుకోవడం కొందరికి రివాజు. మనం కొలిచే దైవాలు శివకేశవులిద్దరూ నీలవర్ణులే. 'గౌరిదేవి నీ శంభుని గళమున నలుపేమిటి ఓయమ్మా' అంటూ లక్ష్మీదేవి ఓసారి పార్వతిని ఉడికిస్తే- 'నారీమణి నీ విష్ణుదేవుడు నలుపుగాడటే కొమ్మా' అని గౌరమ్మ దీటుగా జవాబు చెప్పడం- అందమైన నీలివర్ణంలోని దైవత్వానికి పట్టిన నీరాజనం.
స్పందించే మనసుంటే చాలు, సృష్టి యావత్తు నేత్రపర్వమే. హృదయోల్లాసకారకమే. బాహ్యసౌందర్యాన్ని ఆరాధించడమే కాదు, అంతస్సౌందర్యాన్నీ ఆస్వాదించగల రసహృదయం ఉండాలి. 'వదనంలో లేదు అందం/ అది హృదిలోని కాంతిపుంజం' అన్నాడు ఖలీల్ జిబ్రాన్. హృదయనేత్రం కాంతిమంతమైతే- అన్ని అందాలకూ అతీతమైన శ్రమజీవన సౌందర్యశోభ మిరుమిట్లుగొల్పుతూ సాక్షాత్కరిస్తుంది. వదన సౌందర్యంకన్నా మిన్నగా వర్తన సౌందర్యానికి ఆ కాంతినేత్రం జోతలర్పిస్తుంది. చెమట బొట్టులో రవళించే జీవననాదానికి మౌనంగానే జేజేలు పలుకుతుంది. చైనాలో చెత్త ఏరుకునే ఓ సామాన్య బాలికకు 'అత్యంత అందమైన అమ్మాయి'గా అక్కడి నెటిజన్లు పట్టం కట్టడం ఇందుకు దృష్టాంతం. జానెడు పొట్టకోసం ఆ పాప ఎవరినీ దేబిరించలేదు. ఎటువంటి అవకతవక పనులకూ పాల్పడలేదు. దేహీ అని ఎవరి ఎదుటా చేతులు చాచలేదు. టిబెట్‌కు చెందిన ఆ పదిహేనేళ్ల బాలిక భుక్తికోసం నమ్ముకున్నది శరీర కష్టాన్నే. షాంఘైలోని ఎగుమతి కేంద్రంవద్ద- పారేసిన చెత్తను, ఖాళీ శీతల పానీయాల సీసాలను, డబ్బాలను ఏరుకుని జీవిక గడుపుకొంటున్న ఆ చిన్నారిని అందరికంటే అందమైన అమ్మాయిగా అంతర్జాలం అందలమెక్కించింది- ఆమె శారీరక అందం కాదు, శ్రమించే తత్వం! ఎవరినీ యాచించకుండా ఆటుపోట్లనెదుర్కోగల మానసిక దృఢత్వం!! షాంఘై నగరాన్ని అందంగా మార్చిందని అభినందిస్తూ నెటిజన్లు ఆ బాలికకు అత్యంత సౌందర్యరాశిగా పట్టం కట్టింది అందుకే. కష్టజీవికి ఇరువైపులా నిలిచి- 'త్రిలోకాలలో, త్రికాలాలలో/ శ్రమైక జీవన సౌందర్యానికి/ సమానమైనది లేనే లే'దని నినదించిన మహాకవి వాక్కూ ఆ బాలికను ఆశీర్వదిస్తూనే ఉంటుంది!
29, ఆగస్టు 2010, ఆదివారం
28, ఆగస్టు 2010, శనివారం
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా ?
పల్లవి : అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా…
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా….. ఓ పవిత్ర భారతమా !
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
నిత్యం కొట్టుకుచచ్చే జనాల శ్వేచ్చను చూద్దామా.. దాన్నే స్వరాజ్యమందామా…
ఛరణం 1: కులాలకోసం గుంపులు కడుతూ..మతాలకోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే ..జనాలు తలలర్పిస్తారే..
సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే ?…తెలిసీ భుజం కలిపి రారే ?
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి…పోరి ఏమిటి సాధించాలి…
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ..ఈ చిచ్చుల సిధూరం…
జవాబు చెప్పే భాధ్యత మరచిన జనాల భారతమా..! ఓ ..రణాల భారతమా..!!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…
ఛరణం 2: అన్యాయన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం,
కారడవులలో కౄరమృగంలా దాక్కొని ఉండాలా.. వెలుగుని తప్పుకు తిరగాలా ?
శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం,
స్వజాతివీరులననచే విధిలో కవాతు చెయ్యాలా… అన్నల చేతిలొ చావాలా ?
తనలో దైర్యం అడవికి ఇచ్చి…. తన ధర్మం చట్టానికి ఇచ్చి…
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే….
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మంధారం…
ఈ సత్యా సింధూరం… వేకువవైపా చీకటిలోకా ఎటు నడిపేరమ్మా !…
గతి తోచని భారతమా….!!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
యుద్ధనినాదపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…
ఛరణం 3: తనతలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని, తనలో నీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకొని, ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్లు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుదంట…. ఆవేశం!
ఆ హక్కేదో తనకే ఉందని శాశిస్తుందట … అధికారం !!
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం…. చితి మంటల సింధూరం…
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా…! ఓ.. విషాద బారతమా…!!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా….. ఓ పవిత్ర భారతమా….
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
నిత్యం కొట్టుకుచచ్చే జనాల శ్వేచ్చను చూద్దామా…
దాన్నే స్వరాజ్యమందామా……..!!!
విశిష్టత : 1997 ‘నంది’ అవార్డ్ విజేత
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
చిత్రం : సింధూరం (Sindhuram)
స్వరకల్పన : శ్రీ (sri)
గానం : ‘గానగంధర్వ’ ఎస్.పి.బాలు (S.P.Balu)
పాడవోయి భారతీయుడా
పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా
నేడే స్వాతంత్ర్యదినం.. వీరుల త్యాగఫలం..
నేడే నవోదయం నీదే ఆనందం..
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి..
సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే సరిపోదోయి.
ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా..
ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..
అవినీతి బంధుప్రీతి,
ఈ దేశమెటు దిగజారూ.. కాంచవోయి నేటి దిస్థితి..
ఎదిరించవోయి ఈ పరీస్థితి..
పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ.. ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే..
స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం..
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం.. సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.. ఏకదీక్షతో గమ్యం చేరిననాడే.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం..
27, ఆగస్టు 2010, శుక్రవారం
adjunt requirement of AB+ Blood
Adjunt requirement of AB+ blood to Anuradha (she is suferred her father's condition he is admitted in YASHODA HOSPITAL, SOMAJIGUDA)
INTERESTED DONARS PLS CONTACT THIS NO:9949755941
thanks urs vijaya narasimha..,
"DONATION OF BLOOD LEADS TO SAVE THE LIFE"
RE: Scholarship ( S.V.VIDYADANA TRUST: TIRUPATI.)
Adjunt requirement of AB+ blood to Anuradha (she is suferred her father's condition he is admitted in YASHODA HOSPITAL, SOMAJIGUDA)
INTERESTED DONARS PLS CONTACT THIS NO:9949755941
thanks urs vijaya narasimha..,
"DONATION OF BLOOD LEADS TO SAVE THE LIFE"
ప్రేమా..! ప్రేమించకే.....
మనమెందుకు ప్రేమిస్తాం...?
మన కోసమా లేక తను మనల్ని ప్రేమిస్తుంటే కాదనలేని మొహమాటంతోనా...?
అన్నింటిని ప్రేమించినట్టే తననీ చాలా మామూలుగా (ఏమీ,... చివరికి తన ప్రేమనీ) ఆశించకుండా ప్రేమిస్తామా...? ప్రేమించగలమా...?
ప్రేమ పయనం
ఉండకపోతే మన ముందు (చరిత్రలో) పృధ్వీ సంయుక్తలూ, సలీం అనార్కలీలు,... ఉండేవారు కాదేమో...!
సరే మరి... మన తర్వాత...?
నేస్తం... "ప్రేమ పయనం" ఆగేది కాదు సాగేది...
ఏకాంతం కావాలి...!
ఏకాంతం కావాలి...!
ప్రేమలో_ మనమెప్పుడైనా ఏకాంతాన్ని కోరుకుంటామా...?
తనతో ఉన్నప్పుడు, ఉండాలనే ఏకాంతం కాదు. మనలోకి చూసుకోవడం కోసం ఏకాంతం...!
తను మనకు పంచే ప్రేమనీ, మనలోని ప్రేమ గాఢతనీ చూసుకోవాలంటే ఏకాంతం తప్పనిసరి.
ఏకాంతం..... ఆస్వాదించ లేని వారికి "ఏకాకితనం"లా ఉంటుంది, దాన్ని స్వాగతించ గలిగితే "ఓ కాంత" సాహచర్యంలా అందమైన అనుభూతుల్నెన్నో పంచుతుంది.
ప్రియమైన... నీ కోసం...
మనల్ని కదిలించలేవని,
వాన చినుకులంత
స్వచ్ఛమైన చిరునవ్వుల్తో..
పగలే వెన్నెలలయ్యే మోహావేశంతో..
వెన్నెలలూ వేడనిపించే
కోరికల గాడ్పుల మధ్య-
అరుణిమలు నింపుకునే
తనువుల తన్మయత్వానికి
గాఢానుబంధనాల సౌఖ్యాన్ని జతచేస్తూ,
సాగే నిశ్శబ్ద యుద్ధంలో-
ప్రశాంతానుభూతిని గుండెనిండా నింపుకుంటూ
ఒకరి వెన్నంటి మరొకరుగా
మసలే మన జీవన ప్రయాణంలో
ఇరువురమూ ఒకరమేనని
ఒక్కటిగా కలిసిపోవాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ...
ఇలాంటి పుట్టినరోజులెన్నో
మనిద్దరిమధ్యా జ్ఞాపకాలై
మధురానుభూతినివ్వాలని ఆశిస్తూ...
ప్రేమతో.....
ప్రేమకు స్వేచ్ఛ
ప్రేమకూ స్వేచ్ఛకూ సంబంధం ఉందా...?
అలాగే... ప్రేమకూ, నమ్మకానికీ, స్వేచ్ఛకూ సంబంధం ఉందా...?
మనలో తన మీద ప్రేమ ఉంటే నమ్మకమూ ఉన్నట్లేనా..?
ప్రేమ ఉంటే ఎంతటి స్వేచ్ఛైనా ఇస్తామా...?
ప్రేమో.., మాయో..., ప్రేమే మాయో...!
ప్రేమో.., మాయో..., ప్రేమే మాయో...!
ఈ చిన్ని మనసులో
ఏదో అలజడి...!
ఎందుకో తెలీక
అది ఏదో అర్థం కాక
వాన జల్లుల్లో స్వాతి చినుకై..
తుషార తుంపరల్లో నీటి బిందువై..
ఘనీభవించిన జ్ఞాపకాలు,
కరిగిపోయిన కాలప్రవాహ ఒరవడిలో
మిగిలిపోయిన గతం తాలూకు స్మృతులు,
ఎన్నో...!
ఎవరో గిలిగింతలు పెట్టినట్లు
ఏవో జ్ఞాపకాలు తికమక పెడుతుంటే
నా మనసులో
అదేదో అలజడి (?)
అది ఇష్టమో, అభిమానమో, ఆరాధనో...
నాతో దాగుడు మూతలాడుతూ
తన చిరునామా తెలుపక
నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది.
ఆ పిచ్చి ఏదో కాదు...
'మనసు'లో పుట్టిన ప్రేమ వల్ల
'మన' లో కలిగే పిచ్చి...!
ఎదురుగ ఎందరున్నా
అందర్లోనూ నువ్వే కనిపిస్తూ,
ఎవరి మాటలు వింటున్నా
నీ పిలుపులే ప్రతిధ్వనిస్తూ,
ఏంటీ మాయ...?
ప్రేమంటే మాయా...?
? ? ? ? ? ? ?
ఈ నీలికనులు కూడా...
వ్యక్తం చేయలేని భావాలు
ఎన్నో నాలో
అర్థం చేసుకోగలవా... నేస్తం...!
ఇలా ఎందుకని..?
అనుకోకుండా వచ్చే చిన్న ఎడబాటునే తట్టుకోలేము మనం.
కానీ... తన సుఖం కోసం శాశ్వతంగా దూరమవ్వాలనుకునే మనసు పడే బాధే
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే..
సాహిత్యం:
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా((జయ))
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే
మదనకోమలా కృష్ణా మాధవాహరే
వసుమతీపతే కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే
సురుచినాననా కృష్ణా సౌర్యవారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా
విమలపాలకా కృష్ణా వల్లభీపతే
కమలలోచనా కృష్ణా కామ్యదాయకా ((జయ))
విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా
చరణపల్లవం కృష్ణా కరుణకోమలం
కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే
తవపదాంభుజం కృష్ణా శరణమాశ్రయే
భువననాయకా కృష్ణా పావనాకృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా
ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా
రామసోదరా కృష్ణా దీనవత్సలా ((జయ))
కామసుందరా కృష్ణా పాహిసర్వదా
నరకనాశనా కృష్ణా నరసహాయకా
దేవకీసుతా కృష్ణా కారుణ్యాంబుధే
కంసనాశనా కృష్ణా ద్వారకాస్థితా
పావనాత్మకా కృష్ణా దేహిమంగళం
తృత్పదాంభుజం కృష్ణా శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిశెన్ననూ కృష్ణా శ్రీహరీనమో((జయ))
భక్తదాసనా కృష్ణా హరసునీసదా
కాదునింతినా కృష్ణా సలహెయావిభో
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా((జయ))
(సాహిత్యంలో ఏవన్నా మార్పులు ఉంటే ఎవరన్నా తెలుపగలరు.)
Tagore గొంతులో ఆయన కవితలు, పాట...
విశ్వకవి రవీంద్రుని(1861–1941) గురించి ప్రత్యేకించిన పరిచయం అవసరం లేనేలేదు. దాదాపు అన్నిసాహితీ విభాగాల్లోనూ అందవేసిన చెయ్యి ఆయనది. ఒక సంపూర్ణ కళాకారుడాయన. కవిగా, కథకునిగా, వ్యాస రచయితగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంగీతకారునిగా, గాయకునిగా, చిత్రకారునిగా ఎన్నో అవతారాలెత్తారు. కానీ అన్నింటిలోకీ ముఖ్యంగా ఆయన ఒక కవిగానే మనకు ఎక్కువ కనిపిస్తారు. ఏభైకు పైగా ఉన్న గేయ సంపుటిలు, అందులోని రెండువేలకు పైచిలుకు గేయాలు, 1913లో ఆయన సాహిత్యానికి అందిన "నోబుల్ పురస్కారం" అందుకు నిదర్శనం.
ఇక లిటిరేచర్ స్టూడెంట్ గా డిగ్రీలోనూ, పిజీలోనూ కూడా ఆయన రచనలు కొన్నయినా చదివే అవకాశం లభించటం, దాదాపు పదిహేనేళ్ళ క్రితం మా కలకత్తా ప్రయాణంలో "శాంతినికేతన్" ను చూడటం నా అదృష్టంగా భావిస్తాను నేను. ఆ ప్రయాణంలో కలకత్తాలో మాకు HMVవాళ్ళ రవీంద్రుని సొంత వాయిస్ తో రికార్డ్ చేయబడిన ఆయన కవితలూ,పాటలూ ఉన్న కేసెట్ ఒకటి దొరికింది. అందులో ని ఒక పాటనూ, ఒక రెసిటేషన్ నూ ఇక్కడ పెడుతున్నాను.
(young Tagore)
Tagore's recitations and one song in his own voice:
ఆయన పర్సనాలిటీని, ఫోటోలను చూసి ఆయన గొంతుక చాలా గంభీరంగా ఉంటుండని అనుకునేదాన్ని... కానీ విన్నాకా ఓహో ఇదా ఆయన గొంతుక అనిపించింది. పైగా ఇది ఆయనకు కాస్త వయసు పైబడిన తరువాత చేసిన రికార్డింగా నాకు తోచింది. రవీంద్రుడు స్వయంగా రాసి, స్వరపరిచి "రవీంద్ర సంగీతం"గా ప్రఖ్యాత గాంచిన కొన్ని గీతాల గురించి నా తరువాతి టపాలో....
కొన్ని "శాంతినికేతన్" ఫొటోలు...
EIGHT CLUES TO HAPPINESS
1. First and foremost is GOOD HEALTH. If you do not enjoy good health you can never be happy. Any ailment, however trivial, will deduct from your happiness.
2. Second, A HEALTHY BANK BALANCE. It need not run into crores but should be enough to provide for creature comforts and something to spare for recreation, like eating out, going to the pictures, traveling or going on holidays on the hills or by the sea. Shortage of money can be only demoralizing. Living on credit or borrowing is demeaning and lowers one in one's own eyes.
3. Third, A HOME OF YOUR OWN. Rented premises can never give you the snug feeling of a nest which is yours for keeps that a home provides: if it has a garden space, all the better. Plant your own trees and flowers, see them grow and blossom, cultivate a sense of kinship with them.
4. Fourth, AN UNDERSTANDING COMPANION, be it your spouse or a friend. If there are too many misunderstandings, they will rob you of your peace of mind. It is better to be divorced than to bicker all the time.
5. Fifth, LACK OF ENVY towards those who have done better than you in life; risen higher, made more money, or earned more fame. Envy can be very corroding; avoid comparing yourself with others.
6. Sixth, DO NOT ALLOW OTHER PEOPLE to descend on you for gup-shup. By the time you get rid of them, you will feel exhausted and poisoned by their gossip-mongering.
7. Seventh, CULTIVATE SOME HOBBIES which can bring you a sense of fulfilment, such as gardening, reading, writing, painting, playing or listening to music. Going to clubs or parties to get free drinks or to meet celebrities is criminal waste of time.
8. Eighth, every morning and evening, devote 15 minutes to INTROSPECTION. In the morning, 10 minutes should be spent on stilling the mind and then five in listing things you have to do that day. In the evening, five minutes to still the mind again, and ten to go over what you had undertaken to do.
ప్రేమగానం
ప్రేమ... తెలుగు పలుకులోని తియ్యందనమంతా తనలోనే ఒదిగినట్లుగా ఉన్న ఎంత ఒద్దికైన పదం! రెండేరెండు అక్షరాల్లో వేనవేల నక్షత్రకాంతుల్ని వెదజల్లే ఆ చిన్ని పదం పరిధి ఏ కొలతలకూ అందనిదే. అది- ఆకాశంలా అనంతం... సముద్రంలా అగాధం... ఆ అనంతపు అంచుల్లో విహరించాలని, ఆ అగాధపు కొసల్ని అందుకోవాలని మానవాళి తపించడం, తహతహలాడటం- ప్రేమపదంలోని మహత్తు. ఓ కవితలో ఆరుద్ర అన్నట్లు- ప్రేమ అనే రెండు అక్షరాలను కలిపి చదివితే జీవితమని అర్థం. జీవిత ప్రస్థానంలో మనిషి నడవడికకు దారి చూపించే దివ్యదీపం, మనిషిని నడిపించే జీవన మంత్రాక్షరం ప్రేమ. 'జ్వాలయే దీపమునకు సర్వస్వమైనట్లు/ ప్రణయమే జీవనమున సర్వస్వమయ్యె'నంటూ గాలిబ్- ప్రేమతత్వంలోని ఔన్నత్యాన్ని గొంతెత్తిచాటాడు. అమ్మ చల్లని చూపు, నాన్నారి ఆత్మీయస్పర్శ, తోడబుట్టినవారి వాత్సల్య లాలన, నేస్తాల స్నేహానురాగాలు సర్వం ప్రేమమయమే. సత్యం శివం సుందరం అని పెద్దల వాక్కు. సత్యమే దేవుడు, సర్వవ్యాపి... ఆ భగవంతుడే సౌందర్యమని దాని అర్థం. ప్రేమే దైవమనీ వారు ప్రబోధించారు. సత్య సౌందర్యాల సమ్మేళనమైన దైవస్వరూపమే ప్రేమ, అది సర్వాంతర్యామి అనడానికి ఇంతకన్నా రుజువు ఇంకేముంటుంది? మానవ సంబంధాలన్నింటిలోనూ మహోత్కృష్టమైన స్నేహం, మానవీయ భావనల్లో తలమానికమైన ఆత్మీయతలే శ్రుతిలయలుగా జీవన మహతిపై మనిషి మీటే ప్రేమగానమూ సర్వవ్యాప్తమవుతుంది.
ప్రేమ బహు దొడ్డది. చాలా గడుసుది కూడా. దాని చిన్నెలెన్నో. అది- పిడికెడు పిచ్చిగుండెలో వెన్నెల జలపాతాల్నీ కురిపిస్తుంది, పెను తుపానుల్నీ రేకెత్తిస్తుంది. మధురోహలతోనూ ముంచెత్తుతుంది, మధుకీలల్నీ రగిలిస్తుంది. అలాగని- ప్రేమను అనుభూతించనివారంటూ ఉంటారా ఈ లోకంలో? 'చెలి శిరోజపుటుచ్చులో పడనట్టి హృదయము ఉన్నదా? ఉచ్చులో పడి మరల బయటికి వచ్చు హృదయము సున్నరా' అని ఏనాడో తేల్చి చెప్పాడు దాశరథి. ఏదో ఒక దశలో, ఎప్పుడో ఒకప్పుడు ప్రతిమనిషీ ప్రేమలో పడకా తప్పదు. నా నిదుర దోచిన ప్రేయసీ, నీపేరే రాక్షసి అని ముదుముద్దుగా పలవరిస్తూనే- 'పీడవొ, పిశాచమవొ, దుర్విధివొ గాని / నీవు నా దానవైతివేని అదే చాలు'నన్నంతగా ఆమెపట్ల తన అనురాగాన్ని చాటుకొనకా తప్పదు. పెళ్లి విషయంలో ఏమోకానీ, ప్రేమ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఆడపిల్ల ఇంటివారిదే పైచేయి! కోటనేలే రాజయినా, తోటమాలి రాముడైనా- ప్రేమను సాధించుకోవాలంటే నానాపాట్లు పడాల్సిందే. సాక్షాత్తు పరమేశ్వరుడికే తప్పలేదు ఆ అవస్థ. తాను వలచిన గంగను మనువాడాలని ఉబలాటపడ్డాడు మహేశ్వరుడు. గంగ ఇంటికి మారువేషంలో వెళ్లిన ఆయన- ఆమె తల్లి మాటలకు నొచ్చుకుని వెనుదిరిగాడు. ఇదంతా తండ్రికి చెప్పి, ఈశ్వరుడికే తనను అర్పించమని వేడుకొంది గంగ. శివుడు మారువేషంలో ఎందుకు వచ్చినట్లు అంటూ గంగ తండ్రి- 'తాను రాకుంటేను తగు పెద్దలను పంపి/ అబలనర్పించమని అడిగించరాదా?/ ... నాకు నమ్మకముగా నాగకంకణధరుడు/ నిజరూపుగా వస్తె నిను పెండ్లి సేతు'నని కుమార్తెను బుజ్జగించాడు. ఆ తరవాత ఆయన- మగపెళ్లివారి పెద్దలుగా మునుల్ని తనవద్దకు పంపిన శివయ్యకు కూతురునిచ్చి పెళ్లి చేయడం... తెలుగు జానపదుల శివానందలహరి!
పిడికిలి మించని హృదయంలో కొండంత ప్రేమ ఏ క్షణాన, ఎందుకు, ఎలా తిష్ఠ వేసుకు కూర్చుంటుందన్నది- ఎవ్వరూ పూరించలేని ప్రహేళిక. ఏదో అధికారం ఉందన్నట్లుగా, ఏ అనుమతీ అక్కర్లేదన్నట్లుగా ఉన్నట్టుండి వచ్చి కవ్వించే దాని దర్జాయే వేరు. అది, ఆత్రేయ కవిత్వీకరించినట్లు- 'తొలి పొద్దు వెలుగల్లే కనిపించి, తొలి జన్మరుణమేదో అనిపించి...' అప్పటివరకు తెరవని తలుపుల్ని తెరిపిస్తుంది. మైమరపించే చిరు అలికిడితో గుండెను అలరిస్తుంది. చెప్పాపెట్టకుండా బంధాన్ని తెంచుకుని అంతే హఠాత్తుగా నిష్క్రమిస్తుంది. ఎదలో పెనుమంటల్ని రేపి కలల బూడిదరాసుల్ని మిగిలిస్తుంది. అయితేనేం! సఫలమైనా, విఫలమైనా ప్రేమ నిత్యనూతనమైనదే. అజరామరమైనదే. మనసు దక్కకపోవచ్చు. మనసైన మనిషీ దూరం కావచ్చు. అయినా- రక్తంలో కలగలిసిపోయిన ఒక రూపం అనునిత్యం కళ్లలో మెదులుతూనే ఉంటుంది. నరాల్ని మీటిన ఓ చిరునవ్వు గుండెకింద ప్రతిక్షణం వినపడుతూనే ఉంటుంది. కళ్లతోనే చెప్పుకొన్న వూసులు మౌనంగా ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటాయి. ప్రేమ శాశ్వతత్వాన్ని చాటుతూనే ఉంటాయి. ప్రేమది మౌనభాష. 'గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమను చీటికీ మాటికీ బయటకు చెప్పుకొంటామా అమ్ముకుట్టీ...!' అన్నది ఓ పాత్ర నోట ముళ్లపూడి పలికించిన మాట. జర్మనీ వాసులు అలా అనుకోకపోవడం- ఓ విషాదానికి దారితీసింది. ఆ దేశంలో ఒక సంస్థవారు 'లవ్ పెరేడ్' (ప్రేమవేడుక) పేరిట ఇటీవలో ఉత్సవం నిర్వహించారు. మైదానంలో ఒకవైపు- ప్రేమ జంటలు సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో, మరోవైపు- ఆ మైదానానికి దారితీసే సొరంగమార్గం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19మంది చనిపోయారు. వారందరూ పందొమ్మిది, నలభైఏళ్ల మధ్య వయసులోనివారే. ప్రేమికుల కోసం నిర్వహించిన సంగీతోత్సవంలో- ప్రేమగానం రవళించాల్సిన చోట మృత్యుఘోష వినబడటం గుండెల్ని కలచివేసేదే!
(ఈనాడు, సంపాదకీయం, ౦౧:౦౮:౨౦౧౦)
___________________________
అనురాగ బంధాలు
ఒకే నెత్తురు పంచుకు పుట్టిన అన్నాచెల్లెళ్లు. అక్కాతమ్ముళ్ల పేగుబంధం ఎప్పటికీ తెగిపోనిది. అది- ఎన్నటికీ చెరిగిపోని పుట్టుమచ్చలా శాశ్వతమైనది. పెళ్లిమంటపంలో అమ్మచేతిని పట్టుకుని నాన్నారు ప్రమాణపూర్వకంగా పఠించిన మంత్రార్థంలా పవిత్రమైనది. అమ్మ పంచి ఇచ్చిన ప్రాణరక్తమంత చిక్కనైనది. ఒకరిపై ఒకరికిగల మమతలు, అనురాగాలు, ఆత్మీయతలు, అనుబంధాలు ఎల్లవేళలా మారాకు తొడుగుతూనే ఉంటాయి. పసిప్రాయంలో తోబుట్టువుల అల్లరిలో ఎన్ని చిన్నెలో! ఆటలూ పాటలూ, అచ్చట్లూ ముచ్చట్లూ... అంతలోనే రగడలూ, జగడాలు- పిల్లలున్న ప్రతి ఇంటా నిత్యం ప్రత్యక్షమయ్యే సందడే. తమకన్నా ముందుగా పుట్టినంత మాత్రాన అన్నలు, అక్కలు తమపై పెత్తనం చలాయించడాన్ని చెల్లెళ్లు, తమ్ముళ్లు సుతరామూ ఒప్పుకోరు. చిన్నపాపాయి పెద్దబుజ్జాయిపై కళ్లెగరేస్తుంది. తనకన్నా పెద్ద చిన్నారిపై చిన్నబుడతడు తలెగరేస్తాడు. ఒకరితో ఒకరు కలబడటాలు, ఒకరినొకరు కొట్టుకోవడాలు, ఇవతలివారి బుగ్గలపై గిచ్చుళ్లు, అవతలివారి వీపులపై పిడిగుద్దులు... ఇలా పసితనాన ఆ గడుగ్గాయలు సాగించే అల్లరల్లరి విన్యాసాలు ఇంటింటి ముచ్చటే. పిల్లల రగడలపై పంచాయితీకి పెద్దలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే, ఆరుద్ర అన్నట్లు 'తీసుకోకూడదు రైటు చేసినవాళ్ల వాంగ్మూలం/ తీరా రెండో సైడు వింటే అది రాంగ్మూలం'. కాబట్టి నిజంగా రచ్చచేసిన 'బాలనేరస్తులు' ఎవరో తేల్చడం ఓ పట్టాన తెమలని పని. ఎప్పటికప్పుడు పేచీ పెట్టుకోవడం, అప్పటికప్పుడే రాజీకి రావడం, ఎప్పటిలా తిరిగి కలిసిపోవడం చిన్నారి 'నియంతల' పెద్ద మనసు!
అమ్మ తమకు తోడుగా మరో చిచ్చరపిడుగును అందించబోయే వేళ తెలుగు చిన్నారి పెద్ద ఆరిందాలా 'తామర పువ్వంటీ తమ్ముణ్నియ్యావే' అంటూ కూనిరాగం తీస్తుంటే ఎంత వినవేడుక! అదే శ్రుతిలో 'చేమంతి పువ్వంటీ చెల్లెల్నియ్యావే' అంటూ తెలుగు బుడతడు తన సోదరికి పోటీగా వస్తుంటే ఎంత కనసొంపు! తామర పువ్వంటి అన్నదమ్ముల ముంజేతికి కట్టే వీసమెత్తు రాఖీ- తమకు కలకాలం రక్షరేకై అభయమివ్వాలన్నది ఆడపడుచుల ఆకాంక్ష. చేమంతి పువ్వంటి అక్కాచెల్లెళ్లకు తాము పెట్టే పసుపు, కుంకుమలు కలకాలం వెలుగులీనుతుండాలన్నది అన్నదమ్ముల శుభకామన. 'అత్తవారింట భాగ్యం బెంత గల్గిన/ ఆకాశము పొడవు తన కాపురంబుండిన/ మొదట పుట్టింటాశ వదలదింతులకు...' అన్నారు పెద్దలు. ఆడపిల్ల అలా ఆశపడటం- పుట్టినింటివారి పెట్టుపోతల గురించి మెట్టినింటిలో ఘనంగా చాటుకోవడానికే. ఆ విషయంలో తోడబుట్టినవారు ఏ లోటూ చేయకపోయినా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఓ చిన్న లోపానికి అత్తవారింట ఆమె మాటపడే సందర్భాలూ ఉంటాయి. తెల్లని కాకులు లేనట్లే, అల్లునిలో మంచితనమూ ఉండదన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. బహుశా నరుడు అని పేరున్నందుకు కాబోలు అర్జునుడూ ఆ కవి వాక్కును ఒకసారి నిజం చేశాడు. అత్తారింటివారు తనను పిలవలేదని అలిగాడు. 'పున్నమినాడైన బూరెలు వండుకొని, అల్లుడా రమ్మని పిల్చిరె మీవాళ్లు?/ అమావాస్యనాడైన అట్లు వండుకుని, అల్లుడా రమ్మని పిల్చిరె మీవాళ్లు?' అంటూ భార్య సుభద్రపై రుసరుసలాడాడు. ఆ ఆడకూతురు నొచ్చుకుంది. ఎంతైనా ఇద్దరు అన్నల గారాల చెల్లెలు ఆమె! తన పుట్టింటివారిపై మర్యాద తెలియనివాళ్లని పెనిమిటి ముద్రవేయడాన్ని సహించలేకపోయింది. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరగడంతో సుభద్ర అలిగి పుట్టింటికి వెళ్లింది. చిన్నన్న శ్రీకృష్ణుడు ఆమెకు ఘనంగా సారె పెట్టడం గిట్టని వదినెలు సూటిపోటి మాటలన్నా 'కొన్న మానిసులంటె కొదవేమి మనకు?' అని సముదాయిస్తూ ఆయన చెల్లెమ్మను సగౌరవంగా అత్తవారింటికి సాగనంపాడు. మానవ స్వభావాన్ని పురాణ పాత్రలకు ఆపాదిస్తున్న ఈ జానపదం అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు అద్దంపట్టేదే. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పిల్లలను మేనకోడళ్లు, మేనల్లుళ్లు అని ఎందుకంటారు? మేనుకు మేనైనవారు కనుకనే.
పుట్టిల్లు, అత్తవారిల్లు- ఆడపిల్లలకు తమవైన సామ్రాజ్యాలే. 'అన్నలైతే పసిడి అందెలిస్తారు, తమ్ములైతే వేలు సొమ్ములిస్తారు/ గౌరవానికిగాని, ఘనతకుగాని/ తన పుట్టినింటిలో తాను దొరసాని/ మెట్టినింట ఉంటె మగువ యువరాణి' అంటూ తెలుగు ఆడపడుచుల శిరస్సులపై అశీరక్షతలు జల్లాడు తన అక్షరాల్లో కృష్ణశాస్త్రి. అన్నలూ తమ్ముళ్లూ ఇచ్చే ఆ సొమ్ములేపాటివి అనిపించేంతగా వారిపై ఆడపడుచులు ప్రేమానురాగాలు కురిపించడం రక్తసంబంధంలోని గొప్పదనం. దూరాన ఉన్నా అది- మనసులను, మనుషులను నిత్యం కలిపి ఉంచే జీవన సూత్రం. తమ పుట్టినింటివారు పదికాలాలపాటు చల్లగా ఉండాలని, మెట్టినింటిలో ఉన్న ఆ యువరాణుల శుభకామన- వారి తోడబుట్టినవారికి దివ్య దీవెన. తోబుట్టువులకు అంతకుమించిన ఆనందమేముంటుంది? సోదరి చెంత ఉంటే సోదరుల జీవితం సంతోషదాయకంగా ఉంటుందని శాస్త్రజ్ఞులూ చెబుతున్నారు. సోదరీ సోదరుల మధ్య పెనవేసుకున్న అనుబంధం వారి జీవితాల్ని అమితంగా ప్రభావితం చేసినట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త లారా పడిల్కా వాకర్ అంటున్నారు. అక్కాచెల్లెళ్లున్న కుటుంబంలోని మగపిల్లల్లో దాతృత్వ గుణం అధికంగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలడం- పెట్టుపోతల విషయంలో ఆడపిల్లలే ఆ ఇంటిలోని మగపిల్లలకు తొలి గురువులు అనడానికి నిదర్శనం. ఒంటరితనం, అపరాధ భావన, భయం, ఒత్తిడి వంటివాటినుంచి మగపిల్లల్ని బయటపడేసేదీ ఆ బంగారుతల్లుల ఆసరాయే. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు తల్లి లాలనను అందిస్తున్నారనడానికి ఇంతకన్నా దాఖలా ఏముంటుంది? రక్తసంబంధం నిరంతరం పరిమళ భరితమే.
(ఈనాడు, సంపాదకీయం, ౦౮:౦౮:౨౦౧౦)
పిల్లలకి ఒక మంచి వెబ్సైట్...
మా పాప కోసం వెదుకుతూంటే ఇటీవలే నాకు దొరికిన ఒక మంచి వెబ్సైట్ ఇది. దీనిలో గేమ్స్, మిగిలిన ఎంటర్టైన్మెంట్ కాకుండా నాకు బాగా నచ్చినవి "Math Games". ఏడేనిమిదేళ్ళ లోపూ పిల్లలు సులువుగా Maths నేర్చుకోవటానికి వీలుగా ఉండేలా ఉన్నాయి ఈ గేమ్స్.
మీరూ ప్రయత్నించండి..
http://www.toytheater.com/
Scholarship ( S.V.VIDYADANA TRUST: TIRUPATI.)
From: panasaram krishna <panasaram007@gmail.com>
Date: Fri, Aug 27, 2010 at 12:04 AM
Hello All
3. The applicant should be below poverty line as per A.P.State Govt. issued from time to time.
4. For continuation of scholarship in every academic year till post-graduation, the applicant should necessary adhere to the attendance and marks prescribed by the Trust from time to time.
Scholarship for +1 students ( Girls , 55% score in 10th,....... )
From: panasaram krishna <panasaram007@gmail.com>
Date: Thu, Aug 26, 2010 at 11:52 PM
Hello Friends
Panasaram007
26, ఆగస్టు 2010, గురువారం
Need references of Needy homes at Kurnool and Anantapur districts
Happy birthday to Mother
Hi Friends….
As we all are working for the same cause…it is our duty to remind her Selfless deeds once again in order to get some inspiration and keep our desires of helping others burning till the last minute….
This day marks the birth centenary of a simple nun who, through her work among the poorest of the poor, became the conscience-keeper of her century.
Today, August 26, 2010, the birth centenary of Mother Teresa will be marked with celebration and thanksgiving in many parts of the world. This simple nun with her unique brand of faith and compassion was able to alleviate loneliness, hunger and destitution by reaching out through a worldwide mission to millions of abandoned, homeless and dying destitutes, irrespective of their religion, caste, faith or denomination. In the process she became, indisputably, the conscience-keeper of her century.
As one who was associated with her for 23 years and became one of her biographers, it is not easy to encapsulate her remarkable journey. Born in Skopje, a city in the folds of the Balkans, then as now a crucible of many religions and races, she was the youngest of three children of deeply Catholic Albanian parents. Her father died when she was seven; her mother struggled to feed her family and turned increasingly to the local church for spiritual sustenance. Young Agnes (as she was then known) encountered uncertainty and adversity early in life. The lessons of diligence, discipline, frugality and kindness were imbibed in these early years.
Today, when teenagers often have difficulty making up their minds as to which course to study and where, Agnes had decided, at the age of 14, to serve as a missionary, not in her local church, but in faraway India, then a world apart, of which decision the only certainty was that she would never return home.
A new life opened in Calcutta in 1929. She had joined the Loreto Order as a novice aged 19. Here she would take her religious vows and teach for almost 20 years. In 1948, in an even more cataclysmic turn of events, again entirely of her own making, she left the convent doors behind her for a vision of the street. She had realised that this was where her true vocation lay, and she pursued this goal with diligence, even obstinacy. This she did till the Vatican made her its first exception in several hundred years, permitting her to step out of the Loreto Order, but with her vows intact. She would remain a nun but without belonging to an established Order of the Church. These were early signs of spirit and will power, together with prayerfulness and faith, laced with not inconsiderable charm, which would provide the propulsion for the quite incredible journey that lay ahead.
The early milestones lay in recognition within her adopted country – first by the legendary Chief Minister of West Bengal Dr. B.C. Roy, to be followed by national recognition when Jawaharlal Nehru was instrumental in India awarding her the Padma Shri in 1962. Later, another redoubtable Chief Minister of West Bengal, Jyoti Basu, was to provide her his unstinted support.
By 1965, she had set up a vast network of service across India. The time had come for her to move her mission overseas. She saw need everywhere; there were plenty of the poor and hungry in divisive societies in each continent, in desperately poor and prosperous societies alike. And so she set up feeding centres and leprosy stations in Africa, AIDS hospices in North America, community programmers in the Australian outback, and a host of services that helped lift the most marginalised, hungry and lonely from a desolate life in streets and slums of Africa, Asia and the West.
"God loves a cheerful giver" was a refrain I would often hear as I walked with the smiling Sisters of her Order among sullen faces under London's Waterloo Bridge, serving them their only hot meal on a wintry night; in the process I saw where they spent their nights: coffin-sized cardboard boxes, their only homes. In San Francisco and Los Angeles, I talked to young AIDS sufferers in her hospices, knowing that I would never see them again. In Madrid, I met the aged and the destitute, wracked by a disease called loneliness, which Mother Teresa called the "leprosy of the West". And then the final triumph, a centre carved in the heart of Catholicism itself, in the shadow of St. Peter's in the Vatican, handed over by a Polish Pope to an obedient but persistent nun. She appeared a frail figure against the rigid hierarchy of the Church, some of whose members frowned in private that the Vatican had hardly any space let alone for a soup kitchen. Yet, in my eyes, Mother Teresa and John Paul II had, at one stroke, demystified a thousand years of sometimes rigid Papal tradition, in an understanding of the deepest Christian ethic that they shared.
Although she herself remained fiercely Catholic, her brand of faith was not exclusive. Convinced that each person she ministered to was Christ in suffering, she reached out to people of all religions. The very faith that sustained her infuriated her detractors, who saw her as a symbol of a right-wing conspiracy and, worse, the principal mouthpiece of the Vatican's well-known views against abortion. Interestingly, such criticism went largely unnoticed in India, where she was widely revered.
She was criticised for conversion. Yet in all the 23 years I knew her she never once whispered a suggestion regarding conversion. However, I asked her if she did convert. Without a moment's hesitation, she said, "I convert. I convert you to be a better Hindu, a better Muslim, a better Protestant, and a better Sikh. Once you have found God, it is up to you to do with him as you wish." While she never deviated an inch from her path and was a religious, not a social worker, she was quick to realise that in India, Catholicism was practised by a small segment, and the 19th century proselytising approach could not be sustained.
From her humblest beginning in the slums and streets, she reached out to alleviate the problem she encountered by the simplest and most straightforward means available to her. Her thinking was both simple and complex: when asked how she could touch a leprosy sufferer and clean his sores, she said she could do it because for her that man was the suffering Jesus. "I would not clean him for all the money in the world," said an observer. "Nor would I," Mother Teresa replied, "but I would do it for love of Him."
She could multi-task. She had to be a administrator par excellence to set up a multinational organisation that spread to 123 countries by the time she died, with the help of about 5,000 members of her Order, and countless millions volunteers. Her hands were always full, but comforting one individual at a time was more important than "getting lost in numbers"; it had to be that way, because each individual was a divine manifestation, each to be comforted, held, rescued, fed and not allowed to die alone.
I once called her the most powerful woman in the world. Mother Teresa replied: "Where? If I was, I would bring peace in the world." I asked her why she did not use her undeniable influence to lessen war. She replied: "War is the fruit of politics. If I get stuck in politics, I will stop loving because I will have to stand by one, not by all."
She had her critics. There was criticism about her taking money from dubious sources. I once asked her about it. She said without a moment's hesitation. "I accept no salary, no government grant, no Church assistance, nothing. But how can I refuse anyone who chooses to give money in an act of charity. How is this different from the thousands of people who each day feed the poor? My task is to give peace to people. I would never refuse." Yet she never asked for funds or even permitted fund-raising. Mother Teresa depended on providence. She believed if the work was intended, the money would come. If money did not come, the reverse held true.
What would happen to her mission when she passed on, I once asked her. She did not answer but instead only pointed her finger towards heaven. But I persisted. She laughed and said: "Let me go first."
I asked her the third time and this time she replied: "You have been to so many of our missions in India and abroad. Everywhere our Sisters wear the same saris, eat the same kind of food, do the same kind of work. But Mother Teresa is not everywhere. Yet the work goes on." Then she added: "As long as we remain committed to the poorest of the poor and do not end up serving the rich, the work will prosper."
Love all - Serve all9177999263/9000199263
http://ammasocialwelfareassociation.blogspot.com/
http://groups.google.co.in/group/amma-social-welfare-association
http://ammasrinivas4u.blogspot.com/
నేను మనిషిని ప్రేమిస్తాను..నేను మనిషిని నమ్ముతాను..నేను సాటిమనిషికి చేతనైన సాయం చేస్తాను..
ఎందుకంటే నేను మనిషిని అనే ఒక చిన్న స్వార్ధం
25, ఆగస్టు 2010, బుధవారం
24, ఆగస్టు 2010, మంగళవారం
Inspirational-Quotes
| ||||
| ||||
|
Thanks & Regards
S.Sreenivasa Prasad Rao
CIQ GO GREEN TEAM
<Protect Trees—Protect yourself>
కంటిని మోసంచేసే మెదడు
కంటిని మోసంచేసే మెదడు
కవితలు
ఏమో...
ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....
ఇంతే దు:ఖం అయి ఉంటుంది....
ఇవే కన్నీళ్ళయి ఉంటాయి...
ఇదే నిస్పృహ ఆవరించి ఉంటుంది...
ఏమో...మునుపెలా ఓర్చానో గాయాల్ని....
పగిలి ముక్కలైన మనసుని అతికాను
ఉదాసీనమైన మోములో నవ్వు చిందించాను
వెంట వస్తున్న నిరాశను సాగనంపాను
ఏమో ...మునుపెలా ఓర్చానో గాయాల్ని....
మంచితనాన్ని వాడుకున్న స్నేహపు వంచనలు దాటాను
వదలనంటూనే చేయి వీడిన నేస్తాలను వదిలాను
మాటల బాణాలతో మనసు తూట్లుచేసినా భరించాను
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....
ఈనాడిలా ఓడిపోయను...
కన్నీటిలో కరిగిపోయాను...
నిట్టూర్పులో ఆవిరయ్యాను...
మనస్సాక్షికి లోకువయ్యాను...
చెయ్యని నేరానికి దోషినయ్యాను...
ఈనాడిలా ఓడిపోయను...
ఏమో..మునుపెలా ఓర్చానో గాయాల్ని....
ఒకోసారి...
ఒకోసారి...
...గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది
...ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది
...వెలుగు కన్నా చీకటే బాగుందనిపిస్తుంది
ఒకోసారి...
...పరిచయంలేని అపరిచితుల వద్దే మనసు విప్పాలనిపిస్తుంది
...సమాధానం కన్నా చిరునవ్వే చాలనిపిస్తుంది
...కళ్ళు మూసుకుని గుడ్దిగా నమ్మాలనిపిస్తుంది
ఒకోసారి...
...కొన్ని గతాలకు మరపే ముగింపనిపిస్తుంది
...నిట్టూర్పులో కన్నీరే తోడనిపిస్తుంది
...మనుషుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే మనసు కోరుతుంది
ఒకోసారి...
...నిజం కన్నా అబధ్ధమే వినాలనిపిస్తుంది
...వేదనలో హాయికై వెతకాలనిపిస్తుంది
...మాటల కన్నా మౌనమే మేలనిపిస్తుంది...!!
మౌనం...
భావాలకు,భావ వ్యక్తీకరణకు అర్ధం మాటలే అని నమ్మాను కొన్నాళ్ళు...
కానీ మౌనంలో అన్నిటినీ మించిన అర్ధం ఉందని,
మౌనాన్ని మించిన ఆయుధం లేదన్నది అనుభవం నేర్పిన పాఠం!!
"silence ia a great art of conversation..."అన్నారు కూడా!
మౌనం గురించి నా అలోచనలు ఇవి...
అక్షరాలకు అంతం
ఆలొచనల సొంతం
అంతులేని ఆశల శబ్దం
పెదవి దాటని మాటలకర్ధం
అలసిన మనసుకు సాంతం...మౌనం!!
కన్నీట తడిసిన చెక్కిలి రూపం
అలుపెరుగని అలజడులకు అంతం
రౌద్రంలో మిగిలిన ఆఖరి అస్త్రం
యుధ్ధాల మిగిలిన శకలాల భాష్యం
నిశ్శబ్దంలో నిలిచే ఒంటరి నేస్తం....మౌనం!!
సుతిమెత్తని కౌగిలికి
ఆరాటం నిండిన పెదవులకి
మాటలు మిగలని అలకలకి
మాటలు కరువైన మనసులకి
అన్నింటి చివరా మిగిలేది....మౌనం!!
నేను-తాను...
నిన్నలొ ఉన్నది నేను
నేడులొ ఉన్నది తాను
తానెవరో తెలియదు నాకు
నేనెవరో తెలియదు తనకు
గడిచిపోయిన నిన్నలలో నిలిచిపోయిన నన్ను
పరిచయమే లేదంటూ పరిశీలిస్తుందా కన్ను
నువ్వెవరని ప్రశ్నిస్తూ నిలేస్తుంది నన్ను
ఆ శోధనలో నిరంతరం ముఖాముఖి మాకు
కలలలో నిదురలో కలతలో తానే నా తోడు
నేను లేని తానెవరని అచ్చెరువే నాకు
సంసార మధనమే నిరంతర ధ్యానం తనకు
తనతొ చెలిమికై ప్రయత్నమే ప్రతినిత్యం నాకు
నేనే నువ్వంటూ కవ్విస్తుంది నన్ను
నీ నేడే నేనంటూ తడుతుంది వెన్ను
ఒక్క క్షణం కళ్లలోకి సూటిగా చుసి
కనుపాపలో దాగిన రూపు తనదంటుంది
ఆ కొత్త రూపాన్ని నేనేనని నమ్మాలి
నాకై నా వెతుకులాటనికనైనా ఆపాలి
ఈ నిరంతర అన్వేషణకిక స్వస్తి పలకాలి
ఇదే నా అస్థిత్వమని మళ్ళి మళ్ళి నమ్మాలి !!
(నిరంతరం వివాహానంతరం ప్రతి స్త్రీలో జరిగే మధనమే ఇదని నా అభిప్రాయం...)
అంతర్మధనం...
మధనం...అంతర్మధనం....
వైరాగ్యం యదార్ధమైనప్పుడు జీవితాన్ని ఆస్వాదించేదెలా?
కర్తవ్యం నిర్దేశింపబడిఉన్నప్పుడు కోరికల్ని నశింపజేసేదెలా?
చేయూత ఉన్నా చుట్టూరా ఒంటరితనమే ప్రజ్వలిస్తూంటే
మౌనమే ఆధారమని మనసుకి నచ్చచేప్పేదెలా?
తడిఆరని కన్నులు చీకట్లని చూస్తూంటే వెలుగునకై వెతికేదెలా?
బాధ్యతల నడుమ ప్రాణం గిలగిలలాడుతూంటే స్వేచ్చగా అది ఎగిరేదెలా?
మనసంతా నువ్వైనా వేళ
ప్రణయమో
విరహమో
తాపమో
ఇది ఏమో నాకు తెలియదులే
మది నిండా పులకింతేలే
ఎదురు చూపులో
కలవరింతలో
మైమరపులో
తనువంతా కనులాయనులే
ఇది వింతైన అనుభూతేలే
రాగంలో
అనురాగంలో
హృదయనాదంలో
అన్నింటా ఉన్నది నీవేలే
నేనన్నది ఇక నీవేలే
మాటలో
పాటలో
ప్రతి పిలుపులో
వినిపించే నీ పిలుపేలే
నీ మాయే ఇదియని తెలిసెనులే
నీ గమనంలో
ఆ మవునంలో
ప్రతి కదలికలో
ఉన్నదంతా అనురాగమని
తెలుపకనే తెలిపినవి నీ కనులేలే !!
మనసులో మెదిలాయి ...
మనసులో మెదిలాయి ...
మనసులో మెదిలాయి ఆనాటి ఆశలు...
కలలు కన్నఆ కళ్లు
రాగం పలికిన ఆ స్వరం
రంగులు పరిచిన కుంచలు
రంగవల్లులు వేసిన వాకిళ్ళు
ఆట పాటల కేరింతలు
ఘుమఘుమల రుచులు
ఆత్మీయుల మన్ననలు
స్నేహితుల అభిమానాలు
పుస్తకాలకే పరిమితమైన పరిధులు ...
మనసులో మెదిలాయి ఏవో మధురానుభూతులు !!
ఆదర్శాలు ఆలోచనలు
నిర్ణయాలు వాటి నిమజ్జనాలు
ఆవేశాలు ఉద్వేగాలు
నిరాశలు వాటి నిట్టూర్పులు ...
మనసులో మెదిలాయి ఆ నిస్సహాయతలు !!
కలల నుంచి కాగితం పొరల్లోకి జారి
అక్షరం నుంచి ఆవిరైన ఆశలవైపు
జాలిగ చూసాయి కనుమరగైన సంకల్పాలు
నిలకడ లేని నిశ్చయాలను వెక్కిరించాయి
వివేచన చేయగల అంతరంగాలు
చేవలేని ఆక్రోశాలని చీత్కరించాయి
ఆలోచనల హ-హ కారాలు..
మనసులో మెదిలాయి నా పిరికితనపు కసరత్తులు...!!